దిల్ రాజుకి బన్నీ బూస్ట్.. మాట ఇచ్చినట్లేనా?
దిల్ రాజు గత కొంతకాలంగా అనుకున్నంత రేంజ్ లో అయితే కంటిన్యూగా సక్సెస్ లు కొట్టలేకపోతున్నాడు.
By: Tupaki Desk | 28 Feb 2025 12:27 AM ISTదిల్ రాజు గత కొంతకాలంగా అనుకున్నంత రేంజ్ లో అయితే కంటిన్యూగా సక్సెస్ లు కొట్టలేకపోతున్నాడు. గేమ్ ఛేంజర్ వంటి భారీ పాన్ ఇండియా సినిమా అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది కానీ, చివరికి బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా డిజాస్టర్ అయ్యింది. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ కాకపోతే భారీ ఆర్థిక నష్టాలు తప్పేవి కాదు. దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాయి పెద్దగా విజయాలు దక్కలేదు.
ఇక హిందీలో రీమేక్ సినిమాలైన హిట్, జెర్సీ కూడా ఆశించిన లాభాలు తీసుకురాలేకపోయాయి. ఇలాంటి టైంలో పుష్ప 2: ది రూల్ రిలీజ్ తర్వాత, ఇండియా వైడ్ బన్నీ క్రేజ్ దూసుకుపోతున్న నేపథ్యంలో, దిల్ రాజు మరోసారి అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని చూస్తున్నట్లు సమాచారం. గతంలో బన్నీ – దిల్ రాజు కాంబోలో వచ్చిన ఆర్య, పరుగు, డీజే వంటి చిత్రాలు కమర్షియల్ గా దిల్ రాజుకు లాభాలు తీసుకు వచ్చాయి.
అయితే ఈ మధ్య బన్నీ పూర్తిగా తన మార్కెట్‌ను పెంచుకుంటూ, భారీ ప్రాజెక్టులు తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇదే సమయంలో బన్నీ తనకు అత్యంత సన్నిహితమైన నిర్మాతలలో ఒకరైన దిల్ రాజుకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. రీసెంట్‌గా దిల్ రాజుతో ప్రైవేట్‌గా మాట్లాడిన బన్నీ కథ నచ్చితే చేసేద్దాం అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే, ఒకరకంగా దిల్ రాజుకు ఇప్పుడు సరైన దర్శకుడు, కథ దొరికితే, 2027లో బన్నీతో సినిమా చేసే అవకాశం లభించవచ్చు.
ఇదే నిజమైతే, ఇది బన్నీ సపోర్ట్‌గా దిల్ రాజుకు భారీ బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. ప్రస్తుతం బన్నీ హిందీ మార్కెట్‌లోనూ భారీ క్రేజ్ సాధిస్తున్నాడు. అట్లీ, త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలు లైన్లో ఉన్నాయి. అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా లైనప్ లో ఉన్నాడు. అలాంటప్పుడు దిల్ రాజుతో సినిమా చేయడం అంటే ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి.
ఇదిలా ఉండగా, దిల్ రాజు ప్రస్తుతం ఆ కథ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఒకవేళ నిజంగా బన్నీ చెప్పినట్లు మంచి కథ దొరికితే, అతనితో సినిమా ఫైనల్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 2027కి వీరిద్దరి కాంబినేషన్ సెటప్ అయితే, దిల్ రాజుకు మళ్లీ పూర్వవైభవం తిరిగొచ్చే ఛాన్స్ ఉంది. మరి, ఈ కాంబినేషన్ ను డైరెక్ట్ చేసే లక్కీ డైరెక్టర్ ఎవరవుతారో చూడాలి.