Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అల్లు అర్జున్‌ అండ్ క్యూట్‌ ఫ్యామిలీ

అయితే ఈసారి అల్లు అర్జున్‌తో పాటు స్నేహా రెడ్డి, అయాన్‌, అర్హ అంతా వైట్ కలర్‌ టీ షర్ట్స్ ధరించి ఉన్నారు.

By:  Tupaki Desk   |   21 Jan 2025 10:04 AM GMT
పిక్ టాక్ : అల్లు అర్జున్‌ అండ్ క్యూట్‌ ఫ్యామిలీ
X

అల్లు అర్జున్‌ గత కొన్ని వారాలుగా సోషల్‌ మీడియాలో బర్నింగ్ టాపిక్‌గా ఉన్నాడు అనడంలో సందేహం లేదు. పుష్ప 2 విడుదలకు కొన్ని వారాల నుంచి మొదలైన సందడి విడుదల తర్వాత మరింత పెరిగింది. అల్లు అర్జున్‌ పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప 2 సినిమాతో దాదాపు రూ.1900 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. తాజాగా పుష్ప 2 రీలోడ్‌ వర్షన్‌తో రూ.2000 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్ప కోసం దాదాపు నాలుగు ఏళ్ల పాటు పెరిగిన జట్టు, మాసిన గడ్డంతో కనిపించిన అల్లు అర్జున్‌ ఎట్టకేలకు తన అల వైకుంఠపురంలో సినిమా లుక్‌కి వచ్చి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు.


రెగ్యులర్‌గా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో దిగిన ఫోటోలను షేర్‌ చేసే అల్లు అర్జున్‌ మరోసారి ఫ్యామిలీ ఫోటోలతో వైరల్‌ అయ్యాడు. అయితే ఈసారి అల్లు అర్జున్‌తో పాటు స్నేహా రెడ్డి, అయాన్‌, అర్హ అంతా వైట్ కలర్‌ టీ షర్ట్స్ ధరించి ఉన్నారు. చాలా కూల్‌ అండ్ క్యూట్‌గా వీరి ఫ్యామిలీ ఉంది. వీరితో పాటు ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకునే వైట్‌ పెట్‌ డాగ్‌ సైతం ఉంది. పెట్‌ సైతం ఫ్యామిలీకి తగ్గట్లుగా భలే క్యూట్‌గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప రాజ్‌గా ఇన్నాళ్లు అల్లు అర్జున్‌ను చూసి ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుందని, బన్నీ ఈ లుక్‌లోనే కంటిన్యూ కావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.


సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా స్నేహా రెడ్డి ఫ్యామిలీ ఫోటోలను పిల్లల ఫోటోలను ఎక్కువగా షేర్‌ చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలను సైతం ఆమె షేర్‌ చేశారు. అల్లు అర్జున్‌ అభిమానులకు కచ్చితంగా ఈ ఫోటోలు చాలా స్పెషల్‌ అనడంలో సందేహం లేదు. పుష్ప వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత అల్లు అర్జున్‌కి పాన్‌ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ పెరిగారు. అందుకే స్నేహా రెడ్డి ఈ ఫోటోలను షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్‌ షేర్స్‌ దక్కించుకుంది. పిల్లలు అయాన్‌, అర్హలు చాలా పెద్ద వారు అయ్యారని కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉంటే, అల్లు అర్జున్‌కి జోడీగా స్నేహా రెడ్డి గారు ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించవచ్చు అంటూ కొందరు తమ అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారను.


అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ వైరల్‌ కావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి ఈ ఫోటోలు చాలా భిన్నంగా ఉండటంతో అంతకు మించి అన్నట్లుగా ఫ్యాన్స్ ఈ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. త్వరలోనే ఆ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. మరో వైపు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా సినిమాకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే సినిమాను పట్టాలెక్కించి వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. భారీ పీరియాడిక్ ఫిల్మ్‌గా, త్రివిక్రమ్‌ మొదటి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఉండబోతుందట.