Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : గోవాలో ఫ్యామిలీతో పుష్ప స్టార్‌

అల్లు అర్జున్‌ గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా షూటింగ్‌ తో బిజీ బిజీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   30 Sep 2024 7:42 AM GMT
పిక్ టాక్ : గోవాలో ఫ్యామిలీతో పుష్ప స్టార్‌
X

అల్లు అర్జున్‌ గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా షూటింగ్‌ తో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి గోవా వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి గోవాలో సందడి చేశారు. అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గోవాలో సెలబ్రేట్‌ చేశారు. కొడుకు, కూతురుతో అల్లు అర్జున్‌ దంపతులు గోవాలో స్పెషల్‌ డే ను చాలా సంతోషంగా జరుపుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోలను షేర్‌ చేసిన అల్లు దంపతులు నెట్టింట వైరల్‌ అవుతున్నారు. షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా అల్లు అర్జున్‌ ఇలాంటి ఫ్యామిలీ వేడుకలకు సమయం కేటాయిస్తూ ఉంటారు.


స్నేహా రెడ్డి 40 ఏట అడుగు పెట్టిన నేపథ్యంలో గోవాలో స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా పుట్టిన రోజు వేడుక జరిగింది. అల్లు అర్జున్‌ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న స్నేహా రెడ్డి హీరోయిన్ కి ఏమాత్రం తగ్గకుండా అందంగా ఉంటారనే కామెంట్స్ వస్తూ ఉంటాయి. అల్లు అర్జున్‌, స్నేహా రెడ్డిలది ప్రేమ వివాహం. ఇద్దరు సుదీర్ఘ కాలం ప్రేమించుకుని, ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిస్తూ, ఇద్దరు పిల్లలతో టాలీవుడ్‌ లోనే మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ గా నిలిచారు.

ఇక అల్లు అర్జున్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌ నడుస్తోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో మొన్నటి వరకు అల్లు అర్జున్‌ సైతం షూటింగ్ లో పాల్గొన్నారు. మరి కొన్ని రోజుల పాటు షూటింగ్‌ నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెలలో చాలా రోజులుగా వాయిదాలు పడుతూ వస్తున్న ఐటం సాంగ్‌ చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ నటి పుష్ప 2 ఐటం సాంగ్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో పుష్ప 2 కి సంబంధించిన విషయాలు ఎన్నో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే. మలయాళ స్టార్‌ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్‌, అనసూయ ఇంకా పలువురు నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ గా నిలిచిన పుష్ప సినిమాకు సీక్వెల్‌ గా పుష్ప 2 రూపొందుతున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్‌ కు జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన పుష్ప సినిమా భారీ వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.