Begin typing your search above and press return to search.

పుష్ప హాలీడే ప్లాన్‌.. పోలీసులు ఏమంటారో?

అల్లు అర్జున్‌ విదేశాలకు వెళ్లేందుకు ఇప్పట్లో వీలు పడక పోవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది. కొత్త సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకోవాలని భావించిన అల్లు అర్జున్‌ భావించారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Jan 2025 5:30 AM GMT
పుష్ప హాలీడే ప్లాన్‌.. పోలీసులు ఏమంటారో?
X

పుష్ప రెండు పార్ట్‌ల కోసం దాదాపు నాలుగు ఏళ్ల పాటు అల్లు అర్జున్‌ కష్టపడ్డాడు. ముఖ్యంగా పుష్ప 2 సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడం కోసం చివరి రెండు మూడు నెలలు క్షణం తీరిక లేకుండా షూటింగ్‌లో పాల్గొనడంతో పాటు, ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం కాళ్లకి చక్రాలు కట్టుకుని తిరిగిన విషయం తెల్సిందే. ముందుగా అనుకున్న ప్రకారం పుష్ప 2 సినిమా విడుదలైన వెంటనే విదేశాలకు సుదీర్ఘ హాలీడే కోసం అల్లు అర్జున్‌ ఫ్యామిలీతో కలిసి వెళ్లాలి అనుకున్నాడు. కానీ సంధ్య థియేటర్‌ ఘటన మొత్తం ప్లాన్‌ను తలకిందులు చేసింది. ఆయన విదేశాలకు కాదు కదా కనీసం దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి లేదు.

సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందడంతో పాటు బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ పేరును అందులో చేర్చడం, అరెస్ట్‌ చేయడం వంటివి జరిగాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ బెయిల్‌పై బయట ఉన్నాడు. అది కూడా మధ్యంతర బెయిల్‌ కావడంతో కనీసం ఊరు దాటకూడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో బెయిల్‌ కోసం అల్లు అర్జున్‌ లీగల్‌ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో అల్లు అర్జున్ విదేశీ ప్రయాణం గురించిన ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఈ గొడవలన్నింటికి దూరంగా కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉండాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడని, అందుకోసం లీగల్‌ టీం న్యాయ స్థానం నుంచి పోలీసుల నుంచి అనుమతి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు విచారణ పూర్తి అయ్యింది, అల్లు అర్జున్‌ విదేశాలకు వెళ్లినా ఇబ్బంది లేదు అంటూ కోర్టుకు చెప్తే అప్పుడు కోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల బెయిల్‌ ఇవ్వద్దు అంటూ న్యాయ స్థానంలో పోలీసుల తరపున వాదనలు వినిపించారు. దాంతో పోలీసులు విదేశాలకు అల్లు అర్జున్‌ వెళ్లేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ విదేశాలకు వెళ్లేందుకు ఇప్పట్లో వీలు పడక పోవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది. కొత్త సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకోవాలని భావించిన అల్లు అర్జున్‌ భావించారని తెలుస్తోంది. కానీ సంక్రాంతికి సైతం వెళ్లే అవకాశాలు కనపడటం లేదు. పుష్ప హాలీడే ప్లాన్స్‌కి పోలీసుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే త్రివిక్రమ్‌ సినిమాను మొదలు పెట్టాల్సిన అల్లు అర్జున్‌ అంతకు ముందు కొంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు విదేశాల్లో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం వర్కౌట్స్ చేయాలని భావించారు. కానీ అంతా తారుమారు అయ్యిందని ఆయన టీం మెంబర్స్ చెబుతున్నారు. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి బాహుబలి 2 రికార్డ్‌ బ్రేక్ వైపు దూసుకు పోతుంది.