జవాన్ టీం కు పుష్ప రాజ్ గ్రీటింగ్స్..!
అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ హీరోగా వచ్చిన సినిమా జవాన్. షారుఖ్ ఓన్ ప్రొడక్షన్ లో నిర్మించిన ఈ సినిమా వసూళ్ల పరంగా అదరగొట్టేస్తుంది.
By: Tupaki Desk | 14 Sep 2023 6:30 AM GMTఅట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ హీరోగా వచ్చిన సినిమా జవాన్. షారుఖ్ ఓన్ ప్రొడక్షన్ లో నిర్మించిన ఈ సినిమా వసూళ్ల పరంగా అదరగొట్టేస్తుంది. ఆల్రెడీ ఈ ఇయర్ పఠాన్ తో సూపర్ సక్సెస్ అందుకున్న షారుఖ్ జవాన్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. షారుఖ్ ని అట్లీ చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో దీపికా పదుకొనె, నయనతార హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా రిలీజైన టైం లో టాలీవుడ్ సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
ఈ క్రమంలో లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జవాన్ సక్సెస్ గురించి ట్వీట్ చేశారు. జవాన్ టీం అందరికీ బిగ్ కంగ్రాట్స్ అని మొదలు పెట్టి షారుఖ్ మాసియెస్ట్ అవతార్ ఇది.. దేశం మొత్తం ఆయన స్వాగ్ చూపిస్తున్నారు. మీకు ఈ సక్సెస్ రావడం సంతోషకరం.. మేము దీని కోసం ప్రార్ధించామని అన్నారు. సినిమాలో విలన్ గా చేసిన విజయ్ సేతుపతి కూడా తన పాత్రకు ఎప్పటిలానే న్యాయం చేశారని.. దీపిక, నయనతారలు పర్ఫార్మెన్స్ తో మెప్పించారని. అనిరుద్ తన మ్యూజిక్ తో సంగీత ప్రియులందరినీ అలరిస్తున్నాడని. చివరగా డైరెక్టర్ అట్లీకి బిగ్ కంగ్రాట్స్. ఒక మంచి కమర్షియల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తూ అందరు గర్వపడేలా చేశావని ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ జవాన్ కి తన రివ్యూ ఇస్తూ ఆయన ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. పుష్ప 2 కోసం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాను 2024 ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. పుష్ప 1 కన్నా పుష్ప 2 డబుల్ ధమాకా అందిస్తుందని అంటున్నారు.
పుష్ప2 కోసం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. పుష్ప 1 సినిమాకు గాను అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్.. దేవి శ్రీ ప్రసాద్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. జవాన్ సక్సెస్ ని అల్లు అర్జున్ గ్రీట్ చేయగా షారుఖ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు.