Begin typing your search above and press return to search.

స‌హాయంలో బ‌న్నీ బ్రాండ్ ఇమేజ్ ఇది సార్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాతృహృదయం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 10:36 AM GMT
స‌హాయంలో బ‌న్నీ బ్రాండ్ ఇమేజ్ ఇది సార్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాతృహృదయం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయం చేసే గొప్ప మ‌న‌సు అత‌ని సొంతం. స‌హాయం అంటూ ఆయ‌న ఇంటి త‌లుపు త‌డితే? అందని స‌హాయం ఉండ‌దు. ఇండ‌స్ట్రీ ఎంతో ఇచ్చింది. ప్రేక్ష కాభిమానులు చెప్ప‌లేనంత ప్రేమ‌ని అందిస్తున్నారు అందులో కొంతైనా వాళ్ల‌కి తిరిగి ఇవ్వాలి అని గ‌ట్టిగా చెప్పే న‌టుడు బ‌న్నీ. అందుకే ఆప‌త్కాలంలో ఎప్పుడూ ముందుంటారు.

స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న మంచి మ‌న‌సు చాటుకుంటారు. సామాజిక సేవ అన్న‌ది ఓ బాధ్య‌త‌గా ఫీల‌వుతారు. ఆప‌న్న హ‌స్తం అందించ‌డంలో ఎప్పుడూ ముందుండే న‌టుడు. ఇటీవ‌లే కేర‌ళ వ‌య‌నాడ్ ఘ‌ట‌న‌పై తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి మొట్ట మొద‌టిగా స్పందించింది బ‌న్నీనే. బాధితుల్ని ఆదుకునేందుకు త‌న‌వంతు స‌హాయంగా 25 ల‌క్ష‌లు ముఖ్య‌మంత్రి సహాయ నిధికి అందించారు.

అంత‌కు ముందు త‌లెత్తిన మ‌రెన్నో విప‌త్తుల్లోనూ చేసిన స‌హాయం మాట‌ల్లో చెప్ప‌లేనిది. తాజాగా తెలుగు రాష్ట్రాల‌కు కూడా కోటి విరాళం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రానికి 50 ల‌క్ష‌లు చొప్పున రెండు రాష్ట్రాల‌కు కోటి స‌హాయ అందించారు. దీంతో బ‌న్నీ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా అంద‌రికీ తెలిసిన బ‌న్నీ. కానీ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని మ‌రో బ‌న్నీ లోప‌ల ఉన్నాడు? అన్న‌ది ఇండ‌స్ట్రీలో చాలా మంది పెద్ద‌ల‌కు తెలుసు.

ఇండ‌స్ట్రీ వ్య‌క్తుల ద్వారా బ‌న్నీ ప్రేక్ష‌కాభిమానుల‌కు తెలియ‌ని స‌హాయాలు ఎన్నో చేసారు. బ‌న్నీలో ఆ గొప్ప ల‌క్ష‌ణం, స‌హాయ గుణం గురించి ఓ సంద‌ర్భంలో ఓ సీనియ‌ర్ న‌టుడు చెప్ప‌డంతోనే విష‌యం వెలుగులో కి వ‌చ్చింది. ఇది ఆయ‌న‌కు తెలిసిన స‌హాయం మాత్ర‌మే. త‌న‌లాంటి న‌టుల ద్వారా ఇంకెన్నో స‌హాయా కార్య‌క్ర‌మాల్లో బ‌న్నీ పాల్గొన్నార‌ని , ఓ న‌టుడిగా అలాంటి వారిని చూసి స్పూర్తిని పొందొచ్చ‌ని ఎంతో గర్వంగా చెప్పారు.

వ‌య‌సులో చిన్న‌వాడైనా స‌హాయం చేయ‌డంలో పెద్ద మ‌న‌సు క‌ల వాడ‌ని ప‌లు సంద‌ర్భాల్లోనూ ఆయ‌న తెలిపారు. దీంతో అభిమానుల్లో బ‌న్నీ అంటే వ్య‌క్తిగ‌తంగా అభిమానించే వారు రెట్టింపు అయ్యారు. తాజా స‌హాయంపై బ‌న్నీని చూసి అల్లు ఆర్మీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది. ఇది అభిమానుల్లో బ‌న్నీ బ్రాండ్ అంటూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు