వర్క్ మోడ్ లో బన్నీ?.. ఆ వీడియో ఎప్పటిది?
కనీవినీ ఎరుగని రీతిలో వరల్డ్ వైడ్ గా వసూళ్లను రాబడుతోంది.
By: Tupaki Desk | 18 Dec 2024 9:54 AM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకున్నారో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ మూవీ.. వేరే లెవెల్ లో అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో వరల్డ్ వైడ్ గా వసూళ్లను రాబడుతోంది.
విడుదలైన ఆరు రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన పుష్ప-2.. ఇప్పటి వరకు రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. క్రిస్మస్ వరకు అదే దూకుడు కొనసాగించేలా కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ కు మించి సీక్వెల్ హిట్ అయ్యేలా అనిపిస్తోంది. థర్డ్ పార్ట్ కూడా మేకర్స్.. అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
మొత్తానికి బన్నీ కెరీర్ లో పుష్ప సిరీస్ చిత్రాలు.. బెస్ట్ హిట్స్ గా నిలిచిపోయాయి. ఆయన కెరీర్ ను మలుపు తిప్పేశాయి. అదే సమయంలో డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో రీసెంట్ గా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
అయితే అరెస్ట్ అయిన కాసేపటికే.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి శనివారం బయటకొచ్చారు. ఆ రోజంతా ఆయన ఇల్లు టాలీవుడ్ సినీ సెలబ్రిటీల రాక.. పరామర్శలతో కళకళలాడింది. ఆ తర్వాత తన మామయ్యలు చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లిన బన్నీ.. కేసు విషయంపై చర్చించారని తెలుస్తోంది.
ఇక అరెస్ట్ ముందు రోజే.. అల్లు అర్జున్ పుష్ప-2 పోస్ట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇంతలో అరెస్ట్ అయ్యారు. దీంతో ప్రమోషన్స్ కు బ్రేక్ పడుతుందని నెట్టింట టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.
అందులో బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ వేసుకున్న బన్నీ.. చేతిలో బ్యాగ్ తో కనిపిస్తున్నారు. అది ఎయిర్ పోర్ట్ ఆవరణలో తీసిన వీడియోలా తెలుస్తోంది. అల్లు అర్జున్ వేరే లెవెల్ లో కనిపిస్తున్నారు. బన్నీ ఇన్ వర్క్ మోడ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ వీడియో.. ఎప్పటిదనేది తెలియదు. పుష్ప-2 పోస్ట్ ప్రమోషన్స్ ను బన్నీ మళ్లీ స్టార్ట్ చేశారా? లేక పాత వీడియోనా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.