ఐకాన్ స్టార్ లవ్ స్టోరీ పెద్ద సాహసమే!
అభిమాన గణం అంతకంతకు పెరుగు తుందనే కాన్పిడెట్ తోనే మాస్ యాక్షన్ స్టోరీల వైపు ఆసక్తి చూపిస్తుంటారు.
By: Tupaki Desk | 6 Feb 2025 6:50 AMటాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలంతా మాస్ యాక్షన్ హీరోలగానే హైలైట్ అవ్వడానికే చూస్తారు. ఆరకమైన స్టార్ డమ్ క్రియేట్ అయితే ఇండస్ట్రీలో మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. అభిమాన గణం అంతకంతకు పెరుగు తుందనే కాన్పిడెట్ తోనే మాస్ యాక్షన్ స్టోరీల వైపు ఆసక్తి చూపిస్తుంటారు. రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్, గోపీచంద్, రామ్ సహా చాలా మంది అలా హైలైట్ అయిన వారే. వీళ్లలో క్లాసిక్ లవ్ స్టోరీ చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే? అది బన్నీ మాత్రమే.
కెరీర్ ఆరంభంలోనే 'ఆర్య' ,' ఆర్య-2' లాంటి క్లాసిక్ స్టోరీలతో లవర్ బోయ్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బన్నీ కూడా పద్దతి పూర్తిగా మార్చేసి మాస్ జోనర్లోనే ఎక్కువగా సినిమాలు చేసాడు. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియాలో పెద్ద స్టార్. 'పుష్ప' ప్రాంచైజీతో ఇండియాలోనే గొప్ప మాస్ స్టార్ గా పేరొందాడు. అలాంటి స్టార్ తో ఇప్పుడు లవ్ స్టోరీ అంటే పెద్ద సాహసమే అవుతుంది. బన్నీ ఎప్పుడో లవర్ బోయ్ ఇమేజ్ నుంచి దూరంగా వచ్చేసాడు.
ట్రెండ్ ని బేస్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. కానీ బన్నీలో ఇంకా లవ్ స్టోరీలు చేయాలనే కోరిక బలంగా ఉందని ప్రూవ్ అయింది. ఆ విషయాన్ని నేరుగా స్నేహితుడు, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఆరు మెలోడీలతో కూడిన ప్యూర్ లవ్ స్టోరీ చేద్దామని బన్నీ ప్రామిస్ చేసాడుట. ఇక్కడో ప్రత్యేక కారణాన్ని కూడా హైలైట్ చేసినట్లు తెలుస్తోంది.
మిగతా జోనర్లతో పోలిస్తే లవ్ స్టోరీలకు లైఫ్ ఎక్కువగా ఉంటుందని... సినిమా హిస్టరీలో మిగిలిపోయేవి లవ్ స్టోరీలు మాత్రమేనని అంటున్నాడుట. 'దేవదాస్', 'గీతాజంలి', 'ఆర్య' గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే? కారణం ప్రేమ కథలకు ఉన్న ప్రత్యేకత అలాంటిందని బన్నీ ఓ పేపరు మీద దేవి శ్రీకి రాయబారం పంపాడుట. కానీ ఇదంత వీజీ కాదు. ఇప్పటికే బన్నీకి పాన్ ఇండియాలో మాస్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ మాస్ ఇమేజ్ ను పక్కనబెట్టి చేయాల్సిన చిత్రం. ఇలాంటి ప్రయత్నాలు చేసిన హృతిక్ రోషన్ (కాబిల్), ప్రభాస్ (రాధేశ్యామ్) లు ఫెయిలైన సంద ర్భాలున్నాయి.