నేమ్ లో కొత్త లెటర్స్.. బన్నీ అలా చేస్తున్నాడా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. గంగోత్రి అటు పుష్ప-2.. ఆయన గ్రోత్ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.
By: Tupaki Desk | 1 April 2025 11:21 AMటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. గంగోత్రి అటు పుష్ప-2.. ఆయన గ్రోత్ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. పుష్ప సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఓ ఊపు ఊపేశారు. నెవ్వర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేశారు. రీసెంట్ గా పుష్ప సీక్వెల్ తో రూ.1800 కోట్ల హిట్ కొట్టి ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకున్నారు.
అలా కెరీర్ లో పీక్స్ స్టేజ్ లో ఉన్నారు బన్నీ. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరిన్ని భారీ ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు.. న్యూమరాలజీ ఫాలో అవుతారన్న విషయం తెలిసిందే. చాలామంది తమ నేమ్స్ లో ఎక్స్ట్రా లెటర్స్ యాడ్ చేసుకుంటారు.
తమ తమ కెరీర్ లో లక్ కోసం అలా చేస్తుంటారని అంతా అంటుంటారు. అయితే ఇప్పుడు బన్నీ తన నేమ్ కు ఎక్స్ట్రా U లు లేదా N లు యాడ్ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా లేక రూమరా అన్నది తెలియాల్సి ఉంది. అయితే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నేమ్స్ కు ఎక్స్టా లెటెర్స్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నారోనని అంతా మాట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే కొందరు సెలబ్స్ తమ నేమ్స్ కు ఎక్స్ట్రా లెటర్స్ ను యాడ్ చేశారు. హీరో నితిన్.. తన కెరీర్ స్టార్టింగ్ లో ఇంగ్లీష్ నేమ్ లో మార్పులు చేసుకున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా తన పేరుకు ఎక్స్ట్రా అక్షరాలు జోడించారు.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా అలాంటి మార్పులు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా స్క్రీన్ నేమ్ నే మార్చుకున్నారు. రీసెంట్ గా తన తల్లి పేరును యాడ్ చేసి.. సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు. ఆ విషయాన్ని ఆయనే అనౌన్స్ చేశారు. అయితే ఇలాంటి మార్పులు.. వాళ్లకు సక్సెస్ తెచ్చాయో లేదా అనేది తర్వాత విషయం.
కానీ ఆ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్.. నేమ్ లో ఛేంజెస్ చేస్తే.. తన జర్నీలో మరో ఛాప్టర్ స్టార్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఏదేమైనా ఆ విషయంపై ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ ఫుల్ గా వెయిట్ చేస్తోంది. సినిమా కన్నా ఆ విషయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి బన్నీ న్యూమరాలజీ ప్రకారం ఛేంజెస్ చేసుకుంటారో లేదో వేచి చూడాలి.