Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ మీద ఆ తరహా ఇమేజ్.. కొత్త ప్రచారం షురూ!

ఒక ప్రముఖ మీడియా సంస్థ యజమాని సైతం తన కాలమ్ లో రాసేయటంతో ఈ వాదనకు మరింత బలం చేకూరినట్లైందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 5:30 AM GMT
అల్లు అర్జున్ మీద ఆ తరహా ఇమేజ్.. కొత్త ప్రచారం షురూ!
X

ఒక్కోసారి అంతే.. సమస్యలు కట్టకట్టుకొని మీద పడినట్లుగా పరిస్థితులు నెలకొంటాయి. పాన్ ఇండియా హీరోగా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరే హీరోకు సాధించనంత రికార్డు కలెక్షన్లను తన సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి వచ్చినంత కష్టం పగోడికి కూడా రాకూడదు. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని కూడా అర సెకను కూడా దాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పాలి.

అల్లు అర్జున్ ఇమేజ్ విషయానికి వస్తే.. ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకుంటాడనని.. తన గురించి.. తన బలాల గురించి విపరీతమైన అవగాహన ఉంది. అదే సమయంలో తాను అనుకున్నది మాత్రే జరగాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుందన్న ప్రచారం గురించి తెలిసిందే. అంతేకాదు.. కొన్ని విషయాల్లో మొండిగా ఉండటమే కాదు.. తన మాట మాత్రమే తప్పించి.. ఇంకెవరి మాటను కూడా వినిపించుకోడన్న పేరుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే. మెగా ఫ్యామిలీ విషయంలోనూ అల్లు అర్జున్ వైఖరి సపరేట్ గా ఉంటుందని చెబుతారు. మెగా ప్యామిలీలో సవాలచ్చ చోటు చేసుకున్నప్పటికీ.. ఎవరూ కూడా బన్నీ మాదిరి బయటపడిపోయి.. ఫ్యామిలీ మొత్తం ఒకటిగా లేదన్న అభిప్రాయాన్ని కలుగజేయటంలో బన్నీదే మేజర్ పాత్రగా చెబుతారు. ఎన్నికల సందర్భంగా నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవటం దీనికో ఉదాహరణగా చెప్పాలి.

స్నేహితుడికి అండగా నిలవటం మంచిదే. తప్పు లేదు. కాకుంటే.. స్నేహితుడి కారణంగా కుటుంబంలో స్పర్థలు వచ్చేలా.. ఉంటే వెనకడుగు వేయటం తప్పేం కాదు కదా? అంతేనా.. పుష్ప ఎపిసోడ్ గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసుకొని నిప్పులు చెరగటం తెలిసిందే. ఆయన ప్రసంగం పూర్తి చేసిన నాలుగైదు గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ గురించిన సమాచారాన్ని మీడియాకు ఇచ్చేయటం.. ప్రెస్ మీట్ లోనూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యకు కౌంటర్ ఇచ్చేలా వ్యాఖ్యలు ఉండటం అప్పట్లో పలువురికి షాకింగ్ గా మారింది. అదే సమయంలో అల్లు అర్జున్ బిహేవియర్ మీద మరింత చర్చ మొదలైంది.

సీఎం ఆగ్రహంతో ఉన్న వేళ.. ఒక టాప్ హీరోగా ఆయనకు కౌంటర్ ఇవ్వాలన్న ఆలోచనే తప్పుగా పేర్కొంటున్నారు దీనికి తోడుగా మరో వాదన బలంగా వినిపిస్తోంది. సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలన్న ఆలోనకు బన్నీ వచ్చినప్పుడు.. ఇంకెవరు ఆయన్ను కంట్రోల్ చేయకున్నా.. ఆయన తండ్రి.. అల్లు అరవింద్ ఏం చేశారు? అన్నిది ప్రశ్న. మీడిమా సమావేశంలో అల్లు అర్జున్ పక్కనే ఉన్న అల్లు అరవింద్.. మీడియా సమావేశం వరకు విషయం వెళ్లకుండా అడ్డుకోవాలి కదా? తండ్రిగా.. సినీ రంగ పెద్దగా ఆ మాత్రం ఎందుకు రియాక్టు కాలేదు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానంగా ఇప్పుడో కొత్త వాదన తెర మీదకు వచ్చింది.

అల్లు అర్జున్ ఎవరి మాట వినరని.. చివరకు తన తండ్రి చెప్పే మాటల్ని కూడా లెక్క చేయరన్న ప్రచారం జరుగుతోంది. ఒక ప్రముఖ మీడియా సంస్థ యజమాని సైతం తన కాలమ్ లో రాసేయటంతో ఈ వాదనకు మరింత బలం చేకూరినట్లైందని చెబుతున్నారు. ఇందులో నిజానిజాల్ని పక్కన పెడితే.. ఈ తరహా ప్రచారం బన్నీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందన్నది మర్చిపోకూడదు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే అల్లు అర్జున్ కు మరిన్ని కష్టాలు తప్పవని చెప్పక తప్పదు.