Begin typing your search above and press return to search.

బన్నీ సినిమాకు నిర్మాత సమస్యా?

ఈ సినిమాకు పారితోషకాల రూపంలోనే వందల కోట్లు ఖర్చవుతుండడంతో దీన్ని వర్కవుట్ చేయడం కష్టమని సన్ పిక్చర్స్ వాళ్లు వెనక్కి తగ్గారంటున్నారు.

By:  Tupaki Desk   |   14 March 2025 5:00 AM IST
బన్నీ సినిమాకు నిర్మాత సమస్యా?
X

‘పుష్ప: ది రూల్’ సినిమాతో అల్లు అర్జున్ హవా ఎలాంటిదో దేశమంతా చూసింది. నిర్మాతలు చెప్పుకున్నట్లు బాహుబలి-2ను కొట్టేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కాకపోయి ఉండొచ్చు కానీ.. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఇది ఒకటి అనడంలో సందేహం లేదు. నార్త్ ఇండియాలో ఈ సినిమా మామూలుగా ఆడలేదు. పాన్ ఇండియా స్థాయిలో బన్నీ ఫాలోయింగ్‌, మార్కెట్‌ను ఈ చిత్రం మరింత పెంచింది. ఇలాంటి సమయంలో బన్నీ మీద ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి నిర్మాతలు వెనుకంజ వేయరు అనుకుంటాం.

కానీ తన కొత్త చిత్రానికి ప్రొడక్షన్ పరంగా సమస్య తలెత్తినట్లు వార్తలు వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. అట్లీ దర్శకత్వంలో బన్నీ కొత్త చిత్రం చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని వార్తలు వచ్చాయి.

ఐతే ఇప్పుడు సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు పారితోషకాల రూపంలోనే వందల కోట్లు ఖర్చవుతుండడంతో దీన్ని వర్కవుట్ చేయడం కష్టమని సన్ పిక్చర్స్ వాళ్లు వెనక్కి తగ్గారంటున్నారు. కేవలం దర్శకుడు అట్లీనే వంద కోట్ల రెమ్యూనరేషన్ అడిగాడని.. ‘పుష్ప-3’ తర్వాత పెరిగిన బన్నీ రేంజికి తగ్గట్లు అట్లీ కన్నా ఇంకో 50 కోట్లు ఎక్కువై ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని.. మిగతా పారితోషకాలు కూడా కలిపితే రూ.300 కోట్లు దాటిపోతుందని.. ప్రొడక్షన్ కోసం కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉండడంతో అన్ని లెక్కలూ చూసుకుని ఇది లాభదాయకమైన ప్రాజెక్టు కాదని సన్ పిక్చర్స్ వెనుకంజ వేసిందని అంటున్నారు.

దీంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వద్దకు ఈ ప్రాజెక్టు వెళ్లిందని చెబుతున్నారు. కానీ కాంబినేషన్ క్రేజ్‌తో ఎగ్జైట్ అయి చేసిన ‘గేమ్ చేంజర్’ దారుణంగా దెబ్బకొట్టిన నేపథ్యంలో రాజు మళ్లీ అలాంటి రిస్క్ చేస్తారా అన్నది ప్రశ్న. మొత్తానికి ‘పుష్ప-2’ తర్వాత బన్నీ చేయబోయే సినిమాకు నిర్మాణ పరంగా సమస్యలు ఎదురవుతున్నాయంటే వినడానికి ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో చూడాలి.