పుష్ప రాజ్ కి మరో హీరో అవసరమా..?
అల్లు అర్జున్ సినిమాలో శివ కార్తికేయన్ అని అనగానే వెండితెర మీద మరో సూపర్ మల్టీస్టారర్ చూడబోతున్నాం అని అటు తమిళ, ఇటు తెలుగు ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యారు.
By: Tupaki Desk | 12 March 2025 9:15 AM ISTపుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టించిన అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను అట్లీ డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అట్లీతో చేస్తున్న సినిమా గురిచి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ నుంచి ఎలాంటి సినిమా వస్తే బాగుంటుందో పర్ఫెక్ట్ గా అలాంటి సినిమానే అట్లీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా విషయంలో ఒక రేంజ్ సెటప్ సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైన ఈ సినిమా గురించి ఎక్కడో ఒక చోట ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
ఐతే ఈమధ్య అట్లీ, అల్లు అర్జున్ కాంబో సినిమాలో మరో హీరో నటిస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడన్న న్యూస్ వైరల్ అయ్యింది. అట్లీ నుంచి గానీ, అల్లు అర్జున్ టీం నుంచి గానీ ఈ వార్తలపై రెస్పాన్స్ రాలేదు. ఐతే లేటెస్ట్ గా శివ కార్తికేయన్ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నాడు. అట్లీ అల్లు అర్జున్ సినిమా మల్టీస్టారర్ అనే వార్తలకు చెక్ పెట్టారు బన్నీ టీం.
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఆ సినిమా మల్టీస్టారర్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాపై త్వరలో అఫీషియల్ అప్డేట్ వస్తుందని అప్పటివరకు ఎలాంటి వార్తలను నమ్మొద్దని వారు క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ సినిమాలో శివ కార్తికేయన్ అని అనగానే వెండితెర మీద మరో సూపర్ మల్టీస్టారర్ చూడబోతున్నాం అని అటు తమిళ, ఇటు తెలుగు ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యారు.
ఐతే శివ కార్తికేయన్ ఫ్యాన్స్ మాత్రం అతను ఈ సినిమా చేయకపోతేనే బెటర్ అని కామెంట్స్ చేశారు. ఇక ఫైనల్ గా అల్లు అర్జున్ సినిమా గురించి వస్తున్న న్యూస్ నిజం కాదని టీం స్పందించింది. అయినా అల్లు అర్జున్ అదే మన పుష్ప రాజ్ కి మరో హీరోతో అవసరం ఉంటుందా.. ఆయన ఒక్కడే చాలు కదా అని పుష్ప రాజ్ ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోతున్న సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి సినిమా యూనిట్ కాస్ట్ అండ్ క్రూ ప్రకటిస్తే కానీ ఈ వార్తలకు చెక్ పడే ఛాన్స్ ఉంటుంది.