Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ నెక్స్ట్.. ఇది అసలు మ్యాటర్!

పుష్ప 2తో బిగ్ హిట్ అందుకున్న తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఎనౌన్స్ చేస్తాడా? అనే ప్రశ్న కేవలం తెలుగు ఆడియెన్స్‌కే పరిమితం కాలేదు.

By:  Tupaki Desk   |   1 March 2025 4:52 PM IST
అల్లు అర్జున్ నెక్స్ట్.. ఇది అసలు మ్యాటర్!
X

పుష్ప 2తో బిగ్ హిట్ అందుకున్న తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఎనౌన్స్ చేస్తాడా? అనే ప్రశ్న కేవలం తెలుగు ఆడియెన్స్‌కే పరిమితం కాలేదు. పుష్ప ఫ్రాంచైజీ వల్ల అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ వచ్చింది. అందుకే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి బన్నీ మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తను ఏ డైరెక్టర్‌తో పని చేయాలి.. ఏ కథను ఎంచుకోవాలి.. అనే విషయంలో టైమ్ ఎక్కువ తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదే కారణంగా గత కొన్ని నెలలుగా బన్నీ నెక్స్ట్ సినిమా గురించి ఎన్నో గుసగుసలు వినిపించాయి. మొదట అట్లీతో సినిమా ఖరారు అయినట్లు టాక్ వచ్చింది. తర్వాత అనూహ్యంగా త్రివిక్రమ్‌తో సినిమా ఫిక్స్ అయ్యిందని నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా స్క్రిప్ట్ పూర్తిగా లాక్ కాలేదని అప్పటినుంచే టాక్ ఉంది. ఇప్పుడు మళ్లీ అట్లీ ప్రాజెక్ట్ లైన్‌లోకి వచ్చినట్లు కొత్త వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. బన్నీతో పాటు, అభిమానులు కూడా గందరగోళానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలోనే స్టార్ట్ అవుతుందని స్పష్టం చేశారు. అంటే జూన్ తర్వాత ఎప్పుడైనా మొదలయ్యే అవకాశం ఉంది. అయితే అది జూలైలోనా అక్టోబర్‌లోనా, డిసెంబర్‌లోనా? అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకునే దర్శకుడు. ఈసారి పాన్ ఇండియా రేంజ్‌కి తగిన భారీ ప్రాజెక్ట్ కావడంతో ప్రీ ప్రొడక్షన్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ ఇప్పటి పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ ఫిల్మ్‌లు డైరెక్ట్ చేయలేదు. కానీ ఈసారి బన్నీతో కలిసి పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారని చెబుతున్నారు. అందుకే స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆలస్యం అయినా సరే, ఎలాంటి లోపాలు లేకుండా సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీన్ని బట్టి అట్లీ సినిమాకు వెంటనే అవకాశం ఉండకపోవచ్చని అర్ధమవుతోంది.

అట్లీ సినిమా గురించి బన్నీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బన్నీ, అట్లీ కాంబినేషన్‌లో సినిమా ఉండబోతోందనే టాక్ మాత్రం గత కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. మరోవైపు అట్లీ కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయాలని చూస్తున్నాడు. కానీ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా ఆలస్యం అవుతుండటంతో అట్లీ సినిమా వెంటనే పట్టాలెక్కే అవకాశం తక్కువగానే ఉంది. అలాగే అల్లు అర్జున్ లైనప్ లో సందీప్ వంగా కూడా ఉన్నాడు. అతనితో సినిమా 2027 తరువాత ఉండవచ్చు.