బన్నీ ముందు జాగ్రత్త కోసమే.. ఇలా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడు కొత్త దానికోసం ట్రై చేసే నటుడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 4 March 2025 11:20 AM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడు కొత్త దానికోసం ట్రై చేసే నటుడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప 2 సినిమా ఘన విజయం సాధించడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరిగింది . ఈ సినిమా రూ.1800 కోట్లు పైగా వసూళ్లు రాబట్టి, ఇండియన్ సినీ రంగంలో హయ్యెస్ట్ గ్రాసర్ లిస్టులో స్థానం సంపాదించింది. అయితే, అంతటి ఘన విజయం తర్వాత బన్నీ కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లడం అందరిలోనూ అనేక సందేహాలు రేకెత్తించింది.
తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి, మరింత ఫోకస్‌ను పెంచుకోవడానికి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇటీవలే నిర్మాత బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. నటన, డ్యాన్స్, ఫిట్‌నెస్ వంటి అనేక విభాగాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకునే అలవాటు అల్లు అర్జున్‌కు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి అతను యూరప్‌లోని ఓ ప్రముఖ వెల్నెస్ సెంటర్‌లో మెడిటేషన్, మైండ్‌ఫుల్ నెస్ కోర్సులు చేసినట్లు టాక్.
నటనలో బరువైన పాత్రలను చేయడానికి మానసిక ఉత్సాహం చాలా అవసరం. ఫిలిం వర్గాల టాక్ ప్రకారం, బన్నీ తన నెక్స్ట్ స్టెప్స్‌కు మానసికంగా సిద్ధం అవ్వడానికే ఈ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నాడట. అలాగే సంధ్య థియేటర్ ఘటన, అరెస్టు కోర్టు లాంటి విషయాలు కూడా అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాయి. దాని నుంచి కూడా బయటకు రావాలని ఈ ట్రిప్ వేసి ఉండొచ్చని అంటున్నారు.
మరో టాక్ ఏమిటంటే.. పుష్ప రాజ్ క్యారెక్టర్ కంటే పెద్ద పాత్రేదో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప రాజ్ పాత్ర కోసం బన్నీ చాలాకాలం పాటు ఒకే తరహా లుక్ మెయింటైన్ చేసేందుకు చాలా ఓపికతో ఉన్నాడు. ముఖ్యంగా ఆ గెడ్డం, హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. కానీ పుష్ప 2 కోసం రెండేళ్ళ పాటు ఒకే తరహాలో కొనసాగారు. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో కానీ ముందుగానే మానసికంగా ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక కెరీర్ పరంగా చూస్తే బన్నీ పుష్ప 2 తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అట్లీ డైరెక్షన్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ కోసం చర్చలు జరుగుతున్నాయి. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ సినిమాలో భాగం కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అట్లీ త్రివిక్రమ్ ఇద్దరిలో ఎవరి సినిమా ముందు స్టార్ట్ అవుతుంది అనేది కాస్త సస్పెన్స్ గానే ఉంది. అయితే బన్నీ 2026 సమయానికి వరుసగా రెండు సినిమాలను పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ తన కెరీర్‌లో మరింత కొత్తదనం తీసుకురావడానికి ఈ ట్రిప్ ఉపయోగపడేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హాలీవుడ్ సినిమా మేకింగ్ స్టైల్, యాక్టింగ్ టెక్నిక్స్ వంటి వాటిపై కూడా ఆయన డీప్‌గా తెలుసుకోవాలని భావిస్తున్నారని టాక్.
ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రీచ్ పెంచుకోవాలని చూస్తున్నాడట. ఈ ట్రిప్ వల్ల బన్నీ మైండ్‌సెట్ పూర్తిగా ఛేంజ్ అయ్యిందని, త్వరలో మరింత దూకుడుగా తన ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టబోతున్నాడని తెలుస్తోంది. ఇదే సమయంలో తన వ్యక్తిగత బ్రాండ్ విలువను కూడా పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి, ఈ ట్రిప్ వల్ల ఆయన కెరీర్‌లో ఏ మేరకు మార్పులు వస్తాయో చూడాలి.