పుష్ప-2 హిట్ అవ్వాలని అప్పుడు కోరుకున్నా.. నా కష్టం వారికే అంకితం: బన్నీ
స్టార్ డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా రాగా.. మూవీ టీమ్ అంతా అటెండ్ అయింది. ఈ సందర్భంగా వేడుకను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడారు.
By: Tupaki Desk | 3 Dec 2024 4:10 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2 మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించగా.. సూపర్ సక్సెస్ అయింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా రాగా.. మూవీ టీమ్ అంతా అటెండ్ అయింది. ఈ సందర్భంగా వేడుకను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడారు.
పుష్ప.. పుష్ప రాజ్.. నీ అవ్వ తగ్గేదేలే అంటూ పవర్ ఫుల్ గా స్టార్ట్ చేశారు బన్నీ. "పుష్ప-1 సమయంలో ఈ డైలాగ్ చెప్పా.. అప్పుడు సీక్వెల్ కథ వినలేదు. కానీ ఒక మాట చెబుతున్నా.. పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే. అందరికీ ధన్యవాదాలు. నా ఫ్యాన్స్ ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. పుష్ప ఈవెంట్ కు అప్పుడు మీరంతా వచ్చారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత నా అభిమానులు, నా ఆర్మీని కలిసినందుకు ఆనందంగా ఉంది. మీరంటే నాకు పిచ్చబ్బా" అని తెలిపారు.
"మైత్రీ నవీన్ గారు, రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే ఈ సినిమా అయ్యేది కాదు. వారు మమ్మల్ని నమ్మి రూ.కోట్లు కుమ్మరించారు. చెర్రీ గారు.. మీ ఐదేళ్ల జీవితం మాకు ఇచ్చినందుకు థ్యాంక్యూ. కూబా.. దిల్ రూబా మీ దేశాన్ని గర్వపడేలా చేశారు. అవుట్ స్టాండింగ్ వర్క్ చూస్తారంతా. మీ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్. కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడా.. జాతర సీక్వెన్స్ సహా అన్నింటినీ కొరియోగ్రఫీ చేసిన వారందరికీ కూడా" అని తెలిపారు.
సాంగ్స్ అందరూ ఇస్తారని, దేవిశ్రీప్రసాద్ ప్రత్యేకమైన ప్రేమతో పాటలు ఇస్తారని కొనియాడారు. ఫహాద్ ఫాజిల్ అద్భుతంగా నటించారని, ఫస్టాఫ్ అయ్యాక అంతా కచ్చితంగా స్టన్ అయిపోతారని తెలిపారు. రావు రమేష్ గారు, సునీల్ గారు, అనసూయ గారు.. అంతా బాగా నటించారని చెప్పారు. తాను ఎప్పుడూ శ్రీలీల డ్యాన్స్ చూసి ఇష్టపడేవాడినని తెలిపారు. తొలిసారి తనతో పనిచేశాక ఆమె గురించి తెలిసిందని అన్నారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు.
తెలుగమ్మాయిలకు శ్రీలీల స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. తాను ఐదేళ్లుగా పనిచేస్తున్న ఒకే ఒక హీరోయిన్ రష్మిక అని, తనంటే ఎంతో గౌరవమని అన్నారు. సెట్స్ లో ఆమె లేని రోజులు ఊహించలేనని చెప్పారు. రాత్రి 2 గంటలకు పీలింగ్స్ సాంగ్ చేసి మళ్లీ ఉదయాన్ని వచ్చేసిందని అన్నారు. వరుసగా రెండు రోజుల పాటు సరిగా నిద్ర కూడా పోలేదని, చెన్నై ఈవెంట్ లో ఆమె కళ్ళు రెడ్ గా అనిపించాయని అన్నారు. చాలా మంది పేరు సంపాదించుకుంటుందని చెప్పారు.
"పుష్ప సినిమాలు సుకుమార్ గారి చిత్రాలు.. ఇంత మంచి డైరెక్టర్ తెలుగులో ఉన్నారా అని నాకు అనిపిస్తుంది. నేను ప్రమోషన్స్ కు వెళ్తుంటే ఆయన మాత్రం రావడం రాలేదు. సినిమాను పూర్తి చేయడానికి కష్టపడుతూనే ఉన్నారు. అది ఆయన సిన్సియారిటీ.. ఆయన లేకపోతే నేను లేను.. ఆర్య సినిమా లేకపోతే నేను లేను.. ఆయన వల్లే అంతా.. సుకుమార్ చాలా కష్టం అనుభవించారు ఓ సారి. దీంతో సినిమా ఆయన కోసం ఆడాలని కోరుకున్నా" అని బన్నీ తెలిపారు.
సినిమా కోసం అంతా ఐదేళ్లను త్యాగం చేశారు. కాబట్టి అందరికీ గుర్తుండిపోయే మూవీ కావాలని కోరుకున్నానని చెప్పారు బన్నీ. "బాహుబలి ఆడినప్పుడు మనమంతా గర్వించాం. ఇది మన సినిమా అని, మనందరి స్థాయి పెంచిందని భావించాం. ఆర్ ఆర్ ఆర్ టైమ్ లో కూడా గర్వపడ్డాం. ముచ్చటగా మూడోసారి తెలుగు వారికి మరింత పేరు తేవాలని పుష్ప కోసం కష్టపడ్డాం. 80 దేశాల్లో 12 వేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. కచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాం. మీ (ఫ్యాన్స్) ప్రేమకు థ్యాంక్యూ. లవ్ యూ మై ఆర్మీ.. నా కష్టం మీకే అంకితం" అని అల్లు అర్జున్ తెలిపారు.