Begin typing your search above and press return to search.

ఊర మాస్ లో పుష్ప రాజ్ ని బీట్ చేయగలరా..?

పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఐతే సినిమా చూసిన వాళ్లకు ఊర మాస్ క్యారెక్టరైజేషన్ లో ఇంత కన్నా ఎవరు చేయలేరు అన్నట్టుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Dec 2024 4:12 AM GMT
ఊర మాస్ లో పుష్ప రాజ్ ని బీట్ చేయగలరా..?
X

ప్రస్తుతం బాక్సాఫీస్ పై పుష్ప రాజ్ చేస్తున్న మాస్ యుఫోరియా ఎవరు చూసినా ఇదేం విధ్వంసం బాబోయ్ అనేయక తప్పదు. ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన ఆడియన్స్ కి మాస్ స్టఫ్ ఇచ్చింది. యాక్టింగ్ అంటే ఇదిరా కమిట్ మెంట్ అంటే ఇదిరా అనుకుంటూ సోషల్ మీడియా అంతా సందడి చేస్తున్నారు. పుష్ప రాజ్ పాత్ర ఎప్పుడైతే అల్లు అర్జున్ ఒప్పుకున్నాడో అప్పుడే అతను కెరీర్ పరంగా 10 మెట్లు ఎక్కేశాడు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఐతే సినిమా చూసిన వాళ్లకు ఊర మాస్ క్యారెక్టరైజేషన్ లో ఇంత కన్నా ఎవరు చేయలేరు అన్నట్టుగా చెబుతున్నారు. మాస్ హీరోకి పుష్ప రాజ్ కేరాఫ్ అడ్రస్ గా మారాడని అంటున్నారు. మాస్ పాత్రలో పుష్ప రాజ్ పాత్రని ఇప్పుడప్పుడే ఎవరు బీట్ చేయలేరు అన్నట్టుగా డిస్కషన్స్ చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే అది నిజమే అనిపిస్తుంది.

పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ యాటిట్యూడ్ తో అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా లుక్, యాక్టింగ్ మాత్రమే కాదు పుష్ప బాడీలో టాప్ టు బాటమ్ ఆ క్యారెక్టర్ యొక్క యాటిట్యూడ్ ని ప్రదర్శిస్తున్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ ఈ కాంబో ఎప్పుడు వచ్చినా అప్పటివరకు చేసిన సినిమాల కన్నా ది బెస్ట్ ఇవ్వాలని ఉత్సాహపడతారు. పుష్ప 1 తో అది సాధ్యం అయ్యింది పుష్ప 2 తో దాన్ని కొనసాగిస్తారా అనే డౌట్ ఉంది. కానీ పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది.

సినిమా ప్రతి యాస్పెక్ట్ లో అల్లు అర్జున్, సుకుమార్ ఎక్కడ తగ్గలేదు. తెర మీద అల్లు అర్జున్, తెర వెనక సుకుమార్ ఇద్దరు తమ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇచ్చారు. అందుకే ఈరోజు సినిమా గురించి అందరు ఇలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా పుష్ప రాజ్ తో అల్లు అర్జున్ కి మరో నేషనల్ అవార్డ్ పక్కా అన్న రేంజ్ లో చర్చ జరుగుతుంది అంటే సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పుష్ప 2 సినిమా విషయంలో ఆడియన్స్ చేసిన వెయిటింగ్ కు వారికి కావాల్సిన దాని కన్నా ఎక్కువ ట్రీట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక మీదట రాబోయే ఏ సినిమాలో అయినా హీరో పాత్ర ఊర మాస్ అంటే దానికి రిఫరెన్స్ గా పుష్ప రాజ్ ని తీసుకునే అవకాశం ఉంటుంది.