పుష్ప 2.. ఇలా సాగుతోంది..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 కోసం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో కూడా పుష్ప 2 ఉంటుంది.
By: Tupaki Desk | 5 Sep 2024 11:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 కోసం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో కూడా పుష్ప 2 ఉంటుంది. పుష్ప సినిమా సక్సెస్ పార్ట్2 పై అంచనాలు పెంచేసింది. రిలీజ్ లేట్ అయిన కూడా పబ్లిక్ అటెన్షన్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో పుష్ప సినిమాకి మించి ఈ మూవీ ఉండబోతోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ పరంగా సుకుమార్ చాలా మార్పులు చేసారంట.
అందుకే షూటింగ్ బాగా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక వైపు షూటింగ్ కొనసాగిస్తూనే ఎడిటింగ్ వర్క్స్ కూడా సుకుమార్ పూర్తి చేసే పనిలో ఉన్నారంట. పుష్ప సినిమాలోని ఊ అంటావా తరహాలో పుష్ప 2లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతోందంట.
అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ సాంగ్ షూట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ కోసం లీడ్ యాక్టర్ ని ఎంపిక చేయడం పైన సుకుమార్ టీమ్ ఫోకస్ చేసారంట. అయితే ఈ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ముందుగానే థర్డ్ సింగిల్ గా ఈ పాటని రిలీజ్ చేస్తారా లేదంటే షూట్ అయ్యాక డాన్స్ వీడియో షాట్స్ తో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తారా అనేది వేచి చూడాలి.
పుష్ప మూవీ అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తీసుకొచ్చింది. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నారు. అందుకే వీరిద్దరూ కూడా పుష్ప2 కోసం మొదటి సినిమాకి రెట్టింపు అవుట్ ఫుట్ ఇవ్వాలని భావిస్తున్నారంట. సుకుమార్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని రెడీ చేసే పనిలో ఉన్నారు.
పుష్ప ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు. అలాగే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రావు రమేష్ కూడా అన్నారు. పుష్ప పార్ట్ 3 ఉండబోతుందనే టాక్ రావడంతో పుష్ప 2 మీద అంచనాలు మరింత పెరిగాయి. ఈ కథని ఇంటర్నేషనల్ లెవల్ కి సుకుమార్ తీసుకొని వెళ్తున్నాడనే అభిప్రాయం ఫ్యాన్స్ లో ఏర్పడింది.