పుష్ప-2.. 3D ఎందుకు రావట్లేదంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2.. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 4 Dec 2024 5:00 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2.. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలకు రంగం సిద్ధమైంది. సినీ ప్రియులు, అభిమానులు.. మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి. ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో కొనసాగుతున్నాయి.
మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప సీక్వెల్ ను మొత్తం ఏడు ఫార్మాట్స్ (ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ) విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాల డోస్ మరింత పెరిగింది.
అయితే ఇంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవ్వనుండగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 3డీ వెర్షన్ ను మేకర్స్ విడుదల చేయడం లేదని తెలుస్తోంది. కావాల్సిన విధంగా షూటింగ్ చేసినప్పటికీ.. 3డీ వెర్షన్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి అవ్వలేదని సమాచారం. అందుకే ప్రస్తుతానికి థియేటర్స్ లో 2డీ వెర్షన్ ను మాత్రమే రిలీజ్ చేస్తున్నారట.
ఈ మేరకు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 3డీ వెర్షన్ కు బదులుగా 2డీ వెర్షన్ ను అన్ని చోట్ల ప్లే అవుతుందని తెలిపారు. అయితే 2డీ వెర్షన్ కు సంబంధించిన అవుట్ పుట్ రెడీ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్ వెర్షన్ ను ఒకటికి రెండు సార్లు మేకర్స్ చెక్ చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏవైనా చిన్న చిన్న మార్పు, చేర్పులు ఉంటే చేస్తున్నారని, మూవీ కోసం గట్టి గానే కష్టపడుతున్నారని సమాచారం. పుష్ప సీక్వెల్ 3డీ వెర్షన్ థియేటర్లలో అందుబాటులోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టాక్. అయితే నేడు (డిసెంబర్ 4వ తేదీ) ప్రీమియర్స్ కు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. అయితే పుష్ప సీక్వెల్ ప్రీమియర్ షోస్ ను నార్త్ లో మేకర్స్ వేయడం లేదని ఆదర్శ్ తెలిపారు. అందుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.