Begin typing your search above and press return to search.

అంత పెద్ద రికార్డులను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా?

పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాల లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 టాప్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Oct 2024 12:30 PM GMT
అంత పెద్ద రికార్డులను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా?
X

పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాల లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 టాప్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. సీక్వెల్ కోసం వరల్డ్ వైడ్ గా బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో వెయిట్ చేస్తున్నారు. నార్త్ టు సౌత్.. పుష్ప సీక్వెల్ కోసమే మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఉన్న రికార్డులను బద్దలు కొట్టి.. కొత్తవి క్రియేట్ చేస్తుందంటున్నారు.

అయితే ఇప్పటి వరకు ఎన్నడూ జరగని రీతిలో పుష్ప-2 రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా నిర్మాత రవిశంకర్.. కూడా నెంబర్ ను రివీల్ చేయకపోయినా భారీగా జరుగుతుందని మాత్రం తెలిపారు. దీంతో పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లు రాబడుతుందని అంతా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఆర్ ఆర్ ఆర్ రికార్డును బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు.

వాస్తవానికి పుష్ప-2కు ఉన్న క్రేజ్ చూస్తుంటే అది జరిగేలా కనిపిస్తోంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఏకంగా 11,500 స్క్రీన్లలో సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో 6500 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారట. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా రిలీజ్ కాని స్థాయిలో విడుదల చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఓపెనింగ్స్ విషయంలో చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు. మరి ఫుల్ రన్ లో వసూళ్ల పరిస్థితేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటి వరకు అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో తొలి స్థానంలో దంగల్ ఉందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానంలో రూ.1742 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి-2 ఉంది. మూడో స్థానాన్ని రూ.1250 కోట్లకుపైగా కలెక్షన్స్ తో ఆర్ఆర్ఆర్ మూవీ దక్కించుకుంది. ఆ రెండు సినిమాలను దర్శకధీరుడు రాజమౌళినే తెరకెక్కించడం విశేషం. మరి పుష్ప-2.. ఆ రెండు సినిమాలను అధిగమిస్తుందో లేదో చూడాలని చెబుతున్నారు.

అయితే మేకర్స్.. పుష్ప-2 భారీ వసూళ్లు రాబట్టేలా రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాహుబలి-2నే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు అంతకుమించిన రీతిలో పుష్ప సీక్వెల్ ను విడుదల చేస్తున్నారు. కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మరి పుష్ప-2.. ఓపెనింగ్స్ కాకుండా ఫుల్ రన్ వసూళ్లలో ఆర్ఆర్ఆర్, బాహుబలి-2 రికార్డులు బ్రేక్ చేస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.