Begin typing your search above and press return to search.

పుష్ప 2 బాక్సాఫీస్: వెయ్యి కోట్లకు దగ్గరగా..

సినిమా కంటెంట్ హై రేంజ్ లో ఉండడం వల్లే కలెక్షన్లు అస్సలు తగ్గడం లేదు. ఐదవ రోజు కూడా థియేటర్లు నిండుగా కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 Dec 2024 1:17 PM GMT
పుష్ప 2 బాక్సాఫీస్: వెయ్యి కోట్లకు దగ్గరగా..
X

పుష్ప 2: ది రూల్ సినిమా అంచనాలకు మించి వసూళ్లతో బాక్సాఫీస్‌ను గడగడలాడిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లను రాబడుతోంది. సినిమా కంటెంట్ హై రేంజ్ లో ఉండడం వల్లే కలెక్షన్లు అస్సలు తగ్గడం లేదు. ఐదవ రోజు కూడా థియేటర్లు నిండుగా కనిపిస్తున్నాయి.

పుష్ప రాజ్ జాతర సంద్రంలో ఫ్యాన్స్ మాత్రమే కాదు అన్ని వర్గాల ఆడియెన్స్ మునిగి తేలుతున్నారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా సినిమాను ప్రేక్షకుల గుండెల్లో నిలిపేలా చేశాయి. ఇక బాక్సాఫీస్ వద్ద రోజుకో రికార్డు అందుకోవడం విశేషం. నార్త్ రికార్డులు కూడా గట్టిగానే బ్లాస్ట్ అవుతున్నాయి. అక్కడ ఇప్పటికే లెక్క 300 కోట్లు దాటింది.

ఇక 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా పుష్ప 2 - 922 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ చిత్రసీమలో కొత్త రికార్డును అందుకుంది. ఇది 900 కోట్ల క్లబ్‌ను జెట్ స్పీడ్ లో చేరుకున్న మొదటి ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. మొదటి రోజు నుంచే రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా, ఇప్పటివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రారంభ రోజే పుష్ప 2 అన్ని భాషల్లో కలిపి రెండు వందల కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టి టాలీవుడ్ చరిత్రలోనే భారీ ఓపెనింగ్ అందుకుంది. రెండో రోజూ అదే జోరును కొనసాగించి 170 కోట్ల గ్రాస్‌ను సాధించింది. వారాంతానికి చేరుకునేలోగా సినిమా 600 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇక నాలుగవ రోజుకే 829 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి, భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది. ఐదో రోజుకు ఈ సినిమా 922 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరో మెట్టు ఎక్కింది.

ఇక వెయ్యి కోట్లు రాబట్టేందుకు ఈ సినిమా ఇంకా ఎంతో దూరంలో లేదు. రేపో మాపో బన్నీ కెరీర్ లో మొదటిసారి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరతాడు. ప్రభాస్ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సోలోగా ఆ రికార్డును అందుకున్న హీరోగా కూడా గుర్తింపు అందుకోబోతుండడం విశేషం. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. నాలుగు రోజుల్లోనే 300 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ చిత్రం, బాలీవుడ్ పెద్ద సినిమాలకే పోటీగా నిలిచింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. అమెరికాలో 10 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి, మొత్తం ఓవర్సీస్ మార్కెట్‌లో 163 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ స్థాయిలో పుష్ప 2 వసూళ్లు కొనసాగడం చూస్తుంటే, 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఫైనల్ నెంబర్ ఎక్కడివరకు వెళుతుందో ఉహాలకందని విధంగా ఉంది. పుష్ప 2 విజయంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థాయి వసూళ్లు సాధించిన టాలీవుడ్ సినిమాలు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ మాత్రమే. ఇప్పుడు పుష్ప 2 కూడా ఆ క్లబ్‌లో చేరి భారతీయ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.