Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. ఇంకొక్క వంద రోజులు ఆగితే..

పుష్ప సినిమాతో కేవలం సౌత్ లోనే కాకుండా అటు నార్త్ లో కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్.

By:  Tupaki Desk   |   28 Aug 2024 11:42 AM GMT
అల్లు అర్జున్.. ఇంకొక్క వంద రోజులు ఆగితే..
X

పుష్ప సినిమాతో కేవలం సౌత్ లోనే కాకుండా అటు నార్త్ లో కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అంతకుముందే బన్నీకి నార్త్ జనాల్లో మంచి క్రేజ్ ఉంది. డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్లో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇక పుష్ప 1 సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ అందుకుని ట్రేడ్ వర్గాలకు ఆశ్చర్యాన్నీ కలిగించింది. మరో పవర్ఫుల్ సినిమా వస్తే బన్నీ ఈసారి అంతకుమించి అనేలా సక్సెస్ అందుకుంటాడు అనేలా ప్రశంసలు కూడా వచ్చాయి.

ఇక పుష్ప క్యారెక్టర్ కు ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా రావడంతో ఇప్పుడు బన్నీ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. తప్పకుండా పుష్ప సెకండ్ పార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్కవుతుందని ఇప్పటికే మేకర్స్ వరుస అప్డేట్స్ ద్వారా నమ్మకాన్ని కలిగించారు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దర్శకుడు సుకుమార్ గత ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాల్సింది.

కానీ అనేక కారణాల వలన ఆలస్యం అవుతూ వస్తోంది. ఫైనల్ గా ఈ ఆగస్టులో వస్తుందని అనుకున్నప్పటికి మళ్లీ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా తప్పకుండా అనుకున్న సమయానికి వస్తుంది అని మేకర్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. ఆ మధ్యలో కూడా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా కొన్ని గాసిప్స్ పుట్టుకొచ్చినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు అని మైత్రి మూవీ మేకర్ కొన్ని పోస్టర్స్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఇక ఇప్పుడు మరొక ఆసక్తికరమైన పోస్టర్ కూడా వదిలారు. సినిమా విడుదలకు ఇంకా కరెక్ట్ గా 100 రోజుల సమయం ఉంది అని పుష్ప రాజ్ మాస్ లుక్కు ను హైలైట్ చేశారు. అందులో అతని కళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. స్టిల్ కూడా అద్భుతంగా ఉంది అనేలా ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇక సినిమాను డిసెంబర్ 6వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరొక్క కీలక షెడ్యూల్లో పనులన్నీ పూర్తి చేయబోతున్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నవంబర్ మొదటివారం లోపు ఫినిష్ చేయబోతున్నారు. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఆలస్యం కాకుండా ప్రమోషన్స్ లో పాల్గొనాలి అని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. మరి అతని ప్రణాళికలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.