Begin typing your search above and press return to search.

పుష్ప-2 ఓపెనింగ్స్ సంగతేంటి?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ కోసం పాన్ ఇండియా వైడ్ గా ఉన్న ఆయన ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   17 Oct 2024 10:30 AM GMT
పుష్ప-2 ఓపెనింగ్స్ సంగతేంటి?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ కోసం పాన్ ఇండియా వైడ్ గా ఉన్న ఆయన ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ ను లెక్కల మాస్టర్ సుకుమార్ జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. మంచి అవుట్ పుట్ ఇవ్వాలనే టార్గెట్ తో.. కొన్ని సీన్స్ ను రీషూట్ చేసినట్లు సమాచారం. కొన్నేళ్లుగా సినిమా షూటింగ్ జరుగుతుండగా.. మరికొద్ది రోజుల్లో గుమ్మడికాయ కొట్టనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇండిపెండెన్స్ కానుకగా పుష్ప-2 రిలీజ్ అవుతుందనుకోగా.. కొన్ని కారణాల వల్ల మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. రీసెంట్ గా కౌంట్ డౌన్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. పక్కాగా అనుకున్న తేదీకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మరోసారి అనౌన్స్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లో అల్లు అర్జున్ వేరే లెవెల్ లో ఉన్నారు. పుష్పరాజ్ గెటప్ లో సీరియస్ మోడ్‌ లో కూర్చుని కనిపించారు. బ్యాక్‌ గ్రౌండ్‌ లో పుష్పరాజ్ బ్రాండ్ మార్క్ అయిన చేతి గుర్తు ఆకట్టుకుంటోంది.

ఇక రిలీజ్ డేట్ ఓకే.. మరి ఓపెనింగ్స్ ఎంత వస్తాయన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో.. బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల వసూలు చేయడం పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా వేరే లెవల్ లో ఉండే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు అంటున్నారు. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద నమోదైన అనేక రికార్డులు పుష్ప-2 బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు.

2024లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ.. ఇప్పటివరకు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.182 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత రెండో స్థానంలో దేవర రూ.172 కోట్ల ఓపెనింగ్స్ తో నిలిచింది. అదే సమయంలో ఓవరాల్ గా చూసుకుంటే.. ఇప్పటివరకు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లో టాప్ లో ఆర్ఆర్ఆర్ ఉందన్న విషయం తెలిసిందే.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. రూ.223 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది. ఆ తర్వాత స్థానంలో ప్రభాస్ బాహుబలి-2 మూవీ రూ.214 కోట్లతో ఉంది. ఇప్పుడు పుష్ప-2.. ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న బజ్.. క్రేజ్ చూసుకున్నా.. అది ఈజీనే. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ మరింత దూకుడు ప్రదర్శిస్తే పక్కాగా రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. మరి పుష్ప-2.. ఓపెనింగ్స్ ఎంత వస్తాయో చూడాలి.