పుష్ప 2 ఓటీటీ ప్రభంజనం ఎప్పుడంటే..!
అల్లు అర్జున్, సుకుమార్‌ల పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 4 Jan 2025 1:30 PM GMTఅల్లు అర్జున్, సుకుమార్‌ల పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాలుగు వారాల్లో సినిమా రూ.1800 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. అతి త్వరలోనే సినిమా బాహుబలి 2 రికార్డ్‌లను బ్రేక్ చేయబోతుంది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలో ఇప్పటికే 3వ స్థానంలో ఉన్న పుష్ప 2 సినిమా మరో వారం పది రోజుల్లో ఆ జాబితాలో బాహుబలి 2 ని వెనక్కి నెట్టి 2వ స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు ఓటీటీలో సినిమాను చూడలేం. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌కి భారీ మొత్తానికి అమ్మారు. అయితే ఎనిమిది వారాలు పూర్తి అయిన తర్వాతే స్ట్రీమింగ్‌కి అనుమతించారు.
పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు థియేటర్‌లో చూడని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమధ్య సినిమా లీక్ అయ్యిందనే వార్తలు వచ్చినా ఓటీటీ ద్వారా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అన్ని భాషల్లోనూ సినిమాకు రికార్డ్ స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వసూళ్లు చూసి ఇండియన్ బాక్సాఫీస్ వర్గాల వారు సైతం షాక్ అవుతున్నారు. బాబోయ్ ఇదేం రచ్చ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం నార్త్ ఇండియా నుంచి వచ్చిన వసూళ్లు ఆల్ టైమ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాయి.
నార్త్ ఇండియాలో సినిమా ఇంకా పలు ఏరియాల్లో మంచి వసూళ్లు రాబడుతున్నాయి. వీకెండ్‌లో సినిమాకు మంచి వసూళ్లు సొంతం అవుతున్న కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో తొందర వద్దు అనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు. అందుకే పుష్ప 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కావడంకు మరో రెండు మూడు వారాల సమయం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు పెట్టిన గడువు జనవరి చివరి వారంలో ముగియబోతుంది. అప్పటి వరకు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆగనుందా లేదంటే వసూళ్లు డ్రాప్ కావడంతో సంక్రాంతి సీజన్ తర్వాత ఏ సమయంలో అయినా స్ట్రీమింగ్ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా శ్రీలీల చేసిన కిస్సిక్ సాంగ్‌కి మంచి స్పందన లభించింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ ఘటన కారణంగా మరింతగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ మొదలుకుని పలు విషయాల కారణంగా పుష్ప 2 సినిమా గురించి జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఆ కారణంగా కొన్ని చోట్ల వసూళ్లు పెరిగినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి సినిమాకు ఇండియాస్ బాక్సాఫీస్ వద్ద నమోదు అయిన వసూళ్లు ఆల్ టైమ్ రికార్డ్‌గా చెప్పుకోవచ్చు.