పుష్ప దారి చూపాడు.. నెక్స్ట్ ఎవరు..?
పుష్ప 2 మీద ఉన్న అంచనాలను డబుల్ చేస్తూ పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి బాలీవుడ్ అంతా షేక్ అయ్యిందని చెప్పొచ్చు
By: Tupaki Desk | 21 Nov 2024 12:30 AM GMTపుష్ప 2 మీద ఉన్న అంచనాలను డబుల్ చేస్తూ పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి బాలీవుడ్ అంతా షేక్ అయ్యిందని చెప్పొచ్చు. టాలీవుడ్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ నేషనల్ వైడ్ గా బాక్సాఫీస్ ని శాసిస్తున్న విషయం తెలుసు కానీ బీ టౌన్ ఆడియన్స్ లో మన స్టార్స్ ఇంత క్రేజ్ తెచ్చుకున్నారు అని మాత్రం పుష్ప 2 ఈవెంట్ తో అర్థమైంది. పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో సక్సెస్ అయ్యేలా మైత్రి నిర్మాతలతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా చాలా కష్టపడ్డారు.
ఆ ఈవెంట్ చూసిన తర్వాత మిగతా పాన్ ఇండియా సినిమాల వేడుకలు కూడా అలానే ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కూడా ఎప్పుడు నార్త్ లో ఇలా ఈవెంట్ చేయడానికి సాహసం చేయలేదు. కానీ పుష్ప రాజ్ వైబ్ చూసి ఈవెంట్ ప్లాన్ చేస్తే దాన్ని సూపర్ హిట్ చేశారు. ఈ ఈవెంట్ తో మన స్టార్ సినిమాల వేడుకలకు పాన్ ఇండియా కూడా ఓపెన్ అనిపించేలా చేసింది.
పుష్ప 2 తో అల్లు అర్జున్ అదరగొట్టాడు. నెక్స్ట్ నార్త్ లో చేసే భారీ ఈవెంట్ ఏది అవుతుంది. ఆ సాహసం ఎవరు చేస్తారన్నది చూడాలి. ప్రభాస్ తో పాటు చరణ్ ఎన్టీఆర్ కూడా నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. మరి వీరిలో నెక్స్ట్ నార్త్ ఈవెంట్ ఏది అవుతుంది. పుష్ప 2 కి వచ్చినట్టుగా ఆ ఈవెంట్ కు కూడా అంతే భారీ రెస్పాన్స్ వస్తుందా అన్నది చూడాలి.
మన స్టార్స్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయినా ఎక్కడ ఈవెంట్ జరిగినా సరే తెలుగు రాష్ట్రాల నుంచే కొంతమంది ఫ్యాన్స్ అక్కడకు వెళ్లి హంగామా చేస్తారు. కానీ పుష్ప 2కి వచ్చిన ఫ్యాన్స్ మాత్రం అలా కాదు. వారికి పుష్ప రాజ్ ఎంత నచ్చాడో చెప్పడానికి ఆ ఈవెంట్ ని అంత గ్రాండ్ సక్సెస్ చేశారు. బహుశా బాలీవుడ్ స్టార్స్ కి కూడా ఈ ఈవెంట్ వల్ల మైండ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది.
మరి పుష్ప రాజ్ దారి చూపించాడు కాబట్టి ఆ లైన్ లో నెక్స్ట్ ఏ హీరో అలాంటి ఈవెంట్ ప్లాన్ చేస్తారన్నది చూడాలి. పుష్ప 2 కి సౌత్ లో ఉన్న బజ్ కన్నా నార్త్ లో ఎక్కువ ఉందని ఈ ఈవెంట్ తో అర్ధమైంది. కచ్చితంగ రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే మాత్రం కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం కూడా కష్టమే అన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది.