Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ మళ్లీ దొరికిపోయాడుగా..?

అంటే పుష్ప 2కి చంద్రబోస్ ఒక్కడే లిరిక్స్ అందించాడన్న విషయం అల్లు అర్జున్ కి తెలియదా అనిపించేలా చేశాడు.

By:  Tupaki Desk   |   9 Feb 2025 2:30 PM GMT
అల్లు అర్జున్ మళ్లీ దొరికిపోయాడుగా..?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో బంపర్ హిట్ అందుకున్నాడు. బాలీవుడ్ స్టార్స్ సైతం షేక్ అయ్యేలా తన ఊర మాస్ కలెక్షన్స్ తో అదరగొట్టాడు. పుష్ప 2 రిలీజ్ టైం లో ఆ సినిమా సక్సెస్ ని సరిగా ఎంజాయ్ చేయలేకపోయాడు అల్లు అర్జున్. అందుకే ఆ సినిమా రిలీజైన రెండు నెలల తర్వాత రీసెంట్ గా ఒక సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పుష్ప 2 కి వారు పడిన కష్టం ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరు. సినిమా ఎంత బాగా రీచ్ అయ్యిందన్న విషయాలను వెల్లడించారు.

సినిమాలో పనిచేసిన వారందరి గురించి డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ మాట్లాడి సినిమాకు వారిచ్చిన కాంట్రిబ్యూషన్ గురించి చెప్పుకొచ్చారు. ఐతే అల్లు అర్జున్ పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడాడు. దేవికి ఆ ప్రశంసలు దక్కడం సబబే అనిపించాయి. ఐతే పుష్ప 2 సినిమాకు చివర్లో అది కూడా అత్యవసరమైన టైం లో సామ్ సిఎస్ బిజిఎం అందించాడు.

పుష్ప 2 తన బిజిఎం వర్క్ ఏంటో రీసెంట్ గా సామ్ సిఎస్ రిలీజ్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ కూడా తన వర్క్ కి సంబందించి రిలీజ్ చేశాడు. ఐతే సామ్ సిఎస్ కూడా పుష్ప 2లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని తెలిసిందే. ఐతే అల్లు అర్జున్ సక్సెస్ ప్రెస్ మీట్ లో కనీసం అతని పేరుని ప్రస్తావించలేదు. సామ్ సిఎస్ గురించి మర్చిపోయాడా లేదా కావాలని స్కిప్ చేశాడా అన్నది తెలియదు కానీ అల్లు అర్జున్ సామ్ సిఎస్ ని లైట్ తీసుకున్నాడు.

మరోపక్క పుష్ప 2 సినిమాకు సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ గా చంద్రబోస్ పనిచేశారు. పుష్ప 2కి మాత్రమే కాదు సుకుమార్ ప్రతి సినిమాకు చంద్రబోస్ ఒక్కరే పనిచేస్తారు. కానీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ బోస్ గారు ఇంకా అందరి లిరిసిస్ట్ లు అంటూ ప్రస్తావించాడు. అంటే పుష్ప 2కి చంద్రబోస్ ఒక్కడే లిరిక్స్ అందించాడన్న విషయం అల్లు అర్జున్ కి తెలియదా అనిపించేలా చేశాడు. స్టార్ హీరో ఎక్కడ దొరుకుతాడా అని మీడియా ఎదురుచూస్తుంటే ఇలా వాళ్లకు ఏమాత్రం కష్టం లేకుండా దొరికిపోతూ అల్లు అర్జున్ మళ్లీ మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడు. మరి ఇక మీదట అయినా బన్నీ బాబు జాగ్రత్త పడితే బెటర్.