'పుష్ప-3' మొదలయ్యేది 2027 మిడ్ లోనా?
`పుష్ప- 2` ముగింపులో `పుష్ప-3` ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండవ భాగంలో మూడవ భాగానికి కొన్ని లీడ్స్ కూడా ఇచ్చేసారు.
By: Tupaki Desk | 7 Feb 2025 2:30 PM GMT`పుష్ప- 2` ముగింపులో `పుష్ప-3` ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండవ భాగంలో మూడవ భాగానికి కొన్ని లీడ్స్ కూడా ఇచ్చేసారు. ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అంటే దీనికి సుకుమార్ కూడా సమాధానం చెప్పడం కష్టమేమో. ప్రస్తుతానికి సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకి రెడీ అవుతున్నాడు.
ఇది సమ్మర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసమే ఏడాదిన్నర కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి. అంటే ఈ సినిమా రిలీజ్ గురించి వచ్చే ఏడాది ముగింపు వరకూ ఆలోచించాల్సిన పనిలేదని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో సుకుమార్ ..రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేసి రిలీజ్ చేస్తాడు. అయితే సుకుమార్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా సినిమాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. పుష్ప పాన్ ఇండియాలో సంచలన మవ్వడంతో? ఇప్పుడా బాధ్యత మరింత పెరిగింది.
పైగా రామ్ చరణ్ తో సినిమా అంటే? ఈసారి తాను చేసే సినిమా కచ్చితంగా రామ్ చరణ్ కి జాతీయ అవార్డు తెచ్చేలా ఉండాలి. ఆ బాద్యత కూడా సుకుమార్ దే. ఇప్పటికే 17వ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శతకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అటుపై సుకుమార్ తన చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడు.
కానీ రిలీజ్ మాత్రం ఎప్పుడు? అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఆలెక్కన సుకుమార్- బన్నీ పుష్ప-3 కోసం చేతులు కలపాలంటే కనీసం రెండు సంవత్సరాలకు పైగానే వెయిట్ చేయాలని తెలుస్తోంది. 2027 మిడ్ లో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయని సన్నిహితుల నుంచి లీకులందుతున్నాయి. వారు కూడా ఓ అంచనగా మాత్రమే చెప్ప గల్గుతున్నారు. సుకుమార్ మూడవ భాగం స్క్రిప్ట్ కోసం మరింత హార్డ్ వర్క్ చేయాలని భావిస్తున్నారుట.