పుష్పరాజ్.. ఈ విషయంలో మాత్రం నువ్వు కేక సామీ
దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘పుష్ప 2’ తో మరోసారి టాలీవుడ్ పేరు గట్టిగానే వినిపిస్తోంది.
By: Tupaki Desk | 6 Dec 2024 6:26 AM GMTదేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘పుష్ప 2’ తో మరోసారి టాలీవుడ్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఒక ట్రెండ్ సృష్టించింది. దేశంలో ఎక్కడ చూసిన ఈ మూవీ గురించి చర్చ నడిచింది. అలాగే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మేకర్స్ కూడా వీలైనన్ని మార్గాలలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ జనాల్లోకి వెళ్లేలా చేశారు.
ఇక ఫైనల్ గా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లని అందుకుందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా, తెలుగు, హిందీ భాషలలో ‘పుష్ప 2’ హవా కనిపించింది. ప్రీమియర్ షోలకి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మొదటి సినిమాతో పోల్చుకుంటే ‘పుష్ప 2’ లో బలమైన కథ, కథనం లేదని ఎక్కువ ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకి మెయిన్ స్టోరీ ఎర్రచందనం స్మగ్లింగ్. ఈ కాన్సెప్ట్ ని సుకుమార్ పూర్తిగా డైవర్ట్ చేసాడని అంటున్నారు.
సాంగ్స్ కూడా సిచువేషన్ కి సింక్ అయ్యే ప్లేస్ మెంట్స్ లో లేవని ఆడియన్స్ నుంచి ఓ వర్గం నుంచి వస్తోన్న టాక్. అయితే సినిమా చూసిన అందరూ కూడా యునానమస్ గా ఈ మూవీ అల్లు అర్జున్ వన్ మెన్ షో గురించి మాట్లాడుతున్నారు. పుష్పరాజ్ క్యారెక్టర్ లో అతని పెర్ఫార్మెన్స్ ని ఆస్వాదించాలని అనుకునేవారు కచ్చితంగా ఈ సినిమా చూడాలని చెబుతున్నారు. అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు.
‘పుష్ప’లోనే బన్నీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసాడంటే అంతకు మించి అతను ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ యాటిట్యూడ్ ని మెయింటేన్ చేసాడని అంటున్నారు. కొన్ని సీక్వెన్స్ చూసినపుడు పుష్పరాజ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ తప్ప మరెవరు చేయలేరేమో అనిపించేలా తన యాక్టింగ్ తో బన్నీ అందరిని ఆకట్టుకున్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా గంగమ్మ జాతరలో చీ గెటప్ లో బన్నీ చేసే తాండవం, అతని హై ఇంటెన్షన్ పెర్ఫార్మెన్స్ గూస్ బాంబ్స్ తెప్పిస్తుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక క్లయిమాక్స్ ఫైట్ లో చాలా హార్డ్ వర్క్ చేశాడు అనిపిస్తోంది. పుష్పరాజ్ క్యారెక్టర్ విషయంలో మాత్రం నువ్వు కేక సామీ అనే కామెంట్స్ వస్తున్నాయి.
అలాగే ఎమోషనల్ సీక్వెన్స్ లలో కూడా బన్నీ తనదైన నటనతో కంటతడి పెట్టించాడని సినిమా చూసినవారు అంటున్నారు. బన్నీ నటవిశ్వరూపం చూడాలని అనుకునేవారు కచ్చితంగా ‘పుష్ప 2’ చూడాలని ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. అల్లు అర్జున్ కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని ఒక ఎత్తయితే వాటిని మించిపోయేలా ‘పుష్ప 2’ లో అతని వన్ మెన్ షో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.