'అల్లు అర్జున్ - రామ్ చరణ్' రహస్యంగా?
చరణ్, బన్ని లాంటి పెద్ద స్టార్లు తమ ప్రాజెక్టుల గురించి అనవసరమైన లీకులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే విదేశాల్లో కథాచర్చలు సాగిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 23 March 2025 11:30 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అబుదబీ- దుబాయ్ వంటి డెస్టినేషన్ నగరాలకు రెగ్యులర్ గా విజిట్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకుముందు సుకుమార్ తో తన ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు చరణ్ అరబ్ దేశంలో కనిపించడం గుసగుసలకు తావిచ్చింది. సుకుమార్ తో ఆర్.సి 17 చర్చల్లో భాగంగానే చరణ్ గల్ఫ్ కి వెళ్లారని కథనాలొచ్చాయి. రంగస్థలం తర్వాత చరణ్ - సుకుమార్ ఓ ప్రాజెక్ట్ కోసం సీరియస్ గా చర్చిస్తున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతలోనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో సమావేశంలో భాగంగా అబుదబీ వెళ్లారని టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ఓ సినిమాకి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 2025 నుంచి ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతుందని కూడా కథనాలొచ్చాయి. పుష్ప తర్వాత మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఈ జోడీ నుంచి రానుంది. అలాగే తమిళ దర్శకుడు అట్లీతో గల్ఫ్ దేశంలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అట్లీతో మూవీ కోసం బన్ని దాదాపు 170 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని కూడా గుసగుస వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
చరణ్, బన్ని లాంటి పెద్ద స్టార్లు తమ ప్రాజెక్టుల గురించి అనవసరమైన లీకులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే విదేశాల్లో కథాచర్చలు సాగిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్, ముంబై, చెన్నై లాంటి చోట్ల ఏదైనా ప్రాజెక్ట్ ని ఖరారు చేయాలంటే అది ముందస్తు లీకులతో ఇబ్బందికరంగా మారుతోంది. అభిమానులకు తప్పుడు సమాచారం అందుతోంది. అందుకే విదేశాల్లో కథా చర్చలు సాగిస్తున్నారని కూడా మీడియాలో కథనాలొస్తున్నాయి.
అబుదబీ స్వామినారాయణ్ ఆలయంలో..!
తాజాగా అల్లు అర్జున్ అబుదబీలోని స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు, వీడియోలు వెబ్ లో వైరల్ అవుతున్నాయి. ఆలయ నిర్మాణాన్ని తిలకించిన అల్లు అర్జున్ కి స్థానిక హిందూ దేవాలయ విశిష్ఠతను ఆలయ ప్రతినిధులు వివరించారని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్లు ఆధ్యాత్మిక ప్రదేశాలను విజిట్ చేసేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ముఖ్యంగా చరణ్, అల్లు అర్జున్ ఆధ్యాత్మిక ప్రదేశాలను కుటుంబ సమేతంగా విజిట్ చేస్తుండడం తెలిసినదే.