Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో బన్నీ.. పర్ఫెక్ట్ కాంబో..

ఇక బన్నీ కోసం బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలు కూడా ఫోకస్ పెంచారు.

By:  Tupaki Desk   |   10 Jan 2025 4:10 AM GMT
బాలీవుడ్ లో బన్నీ.. పర్ఫెక్ట్ కాంబో..
X

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకడిగా మారిపోయిన అల్లు అర్జున్ ఏకంగా 1800 కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అయ్యాడు. ఇక అతని నెక్స్ట్ టార్గెట్ 2 వేల కోట్లను దాటి మరో లెవెల్ కు వెళ్లడమే. హిందీ మార్కెట్ లో కూడా బన్నీ రేంజ్ మరింత పెరిగిపోయింది. భవిష్యత్తు ప్రాజెక్టులు మరింత గ్రాండ్ గా ఉంటాయని అర్ధమవుతుంది. ఇక బన్నీ కోసం బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలు కూడా ఫోకస్ పెంచారు. అయితే ఇటీవల బన్నీ ముంబైలో దర్శనమిచ్చారు.

సంజయ్ లీలా భన్సాలీని కలిసి చర్చలు జరిపారని కూడా తెలుస్తోంది. ఈ సమావేశం ఏమైందో స్పష్టత రాకపోయినప్పటికీ, పరిశ్రమలో చర్చలు హోరెత్తుతున్నాయి. భన్సాలీతో భేటీ అనగానే బన్నీ బాలీవుడ్ ఎంట్రీపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతోంది. పుష్ప ఫ్రాంచైజ్ సూపర్ హిట్ కావడంతో, ఉత్తర భారతీయ ప్రేక్షకులకు అల్లు అర్జున్ కొత్తగా పరిచయం అవసరం లేదు. భన్సాలీ, పీరియాడిక్ డ్రామాల స్పెషలిస్ట్‌గా, తన చిత్రాలకు కవితాత్మకమైన విజువల్ ట్రీట్మెంట్ అందించడంలో సిద్ధహస్తుడు.

ఇక లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం, ఆయన ప్రస్తుతం లవ్ అండ్ వార్ అనే పీరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2025 డిసెంబర్‌లో విడుదల కానుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్, గ్రాండ్ సెట్టింగ్స్‌పై దృష్టి సారించారు. ఇక అల్లు అర్జున్, భన్సాలీ కాంబినేషన్ గురించి గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అధికారిక ప్రకటనలు వెలువడలేదు.

కానీ, ఈ ప్రాజెక్టు ఖరారైతే, అది భారతీయ సినిమాలో మరో బిగ్ ప్యాన్ ఇండియా మూవీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భన్సాలీ కూడా చాలా సార్లు సౌత్ సినీ తారలతో పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వస్తే, బన్నీ అభిమానులకు ఇది నిజంగా పండుగే అవుతుంది. ఇక మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ నటించే కొత్త చిత్రం పనులు వేగంగా జరుగుతున్నాయి.

హారికా హాసిని బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ గతంలో అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. దీంతో నెక్స్ట్ ఈ కాంబో పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ తర్వాతే భన్సాలీ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక, అల్లు అర్జున్ సందీప్ రేడిసి వంగా సినిమాకు సంబంధించిన చర్చలపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రభాస్ తో స్పిరిట్ అనంతరం ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందట. త్రివిక్రమ్, భన్సాలీ చిత్రాలను పూర్తి చేసిన తరువాతనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి ఈ టాలెంటెడ్ దర్శకులతో అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ ఇంకా ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.