ఫ్యాన్స్ ను ఆర్మీ అని ఎందుకంటానంటే..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 30 Nov 2024 5:47 AM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాతో డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస ఈవెంట్స్ తో అలరిస్తున్నారు బన్నీ.
ఇప్పటికే పలు నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించిన మేకర్స్.. రీసెంట్ గా ముంబైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు హాజరైన అల్లు అర్జున్ తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. తాను సుకుమార్ వల్ల స్టార్ అయ్యానని తెలిపారు. దాంతోపాటు తన ఫ్యాన్స్ కోసం మాట్లాడారు. తాను అందుకున్న జాతీయ అవార్డు విషయాన్ని ప్రస్తావించారు.
ముంబైలో ఉన్న అనేక మంది తెలుగు ఫ్యాన్స్.. నిన్న జరిగిన వేడుకకు హాజరై ఓ రేంజ్ లో సందడి చేశారు. అది గమనించిన బన్నీ.. ఇక్కడ చాలా మంది తెలుగు అభిమానులు ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. తాను తన అభిమానులను ఎప్పుడూ ప్రేమిస్తున్నట్లు చెప్పారు. వాళ్లు తన కుటుంబమని వెల్లడించారు.
వారంతా తనకు అండగా నిలుస్తారని, తన కోసం ఆర్మీలా పోరాడతారని తెలిపారు. అందుకే తన అభిమానులను ఆర్మీని పిలుస్తానని అన్నారు. పుష్ప ది రూల్ మూవీ పెద్ద హిట్ చేస్తే వారికే అంకితమిస్తానని తెలిపారు. పుష్పతో తన అభిమానులంతా గర్వపడేలా చేస్తానని అల్లు అర్జున్ తన అభిమానులకు మాట ఇచ్చారు.
మరోవైపు, ఉత్తమ నటుడిగా తనకు జాతీయ అవార్డు రావాలని కోరుకున్నానని, అదే కోరికను దర్శకుడు సుకుమార్ తో చెప్పానని అల్లు అర్జున్ చెప్పారు. జాతీయ అవార్డుకు అర్హులని అందరూ భావించేలా సినిమా చేస్తానని సుకుమార్ తనకు మాట ఇచ్చారని, కేవలం ఆయన కృషి వల్లే తనకు జాతీయ అవార్డు దక్కిందని అల్లు అర్జున్ తెలిపారు.
గత 69 ఏళ్లలో ఏ తెలుగు నటుడికి జాతీయ అవార్డు లభించలేదు కాబట్టి తనకు అందిన ఘనత మరింత ప్రత్యేకమైనదని తెలిపారు. 69 సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమలో జాతీయ అవార్డు పొందిన మొదటి నటుడిని తానేనని చెప్పారు. అది తన జీవితంలో ఎప్పుడూ చెప్పుకోదగ్గ విజయంగా ఉంటుందని వెల్లడించారు. అది వెలకట్టలేనిదని అన్నారు. ప్రస్తుతం బన్నీ కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి.