నంద్యాల గొడవ.. తెలివిగా తేల్చేసిన బన్నీ
దీంతో నంద్యాల మ్యాటర్ పై బన్నీ షోలో స్పందించే అవకాశం ఉందని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 22 Nov 2024 7:23 AM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వివాదం గురించి అందరికీ తెలిసిందే. నంద్యాలలో ఉన్న తన ఫ్రెండ్, వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ విష్ చేయడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన, టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అల్లు ఫ్యాన్స్, మెగా అభిమానుల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరిగింది.. జరుగుతోంది కూడా!
ఆ సమయంలో అల్లు అర్జున్ పై అనేక మంది మెగా ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పలు విమర్శలు చేశారు. కానీ బన్నీ ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్కడా స్పందించలేదు. ఆయనే కాదు.. అల్లు కుటుంబం నుంచి కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. అయితే బన్నీ.. ఇటీవల ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో నంద్యాల మ్యాటర్ పై బన్నీ షోలో స్పందించే అవకాశం ఉందని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే మంచి పరిణామం అని.. ఆ వివాదాన్ని క్లోజ్ చేయాలని అనేక మంది భావించారు కూడా. ఇప్పుడు అన్ స్టాపబుల్ కు వచ్చిన బన్నీ తనపై వచ్చిన విమర్శలు, వ్యాఖ్యలు పట్ల సున్నితంగా స్పందించారు.
నేరుగా కాకుండా.. రిలేషన్ షిప్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు! "నేను బాగా నమ్మేది ఏంటంటే.. నేను ఎప్పుడూ ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ మా నాన్న గారు.. ఒకే ఇంట్లో ఉంటాం. ఈ ప్రపంచంలో మా నాన్న గారి కంటే నాకు ఇష్టమైన వ్యక్తి మరెవ్వరూ లేరు" అని బన్నీ తెలిపారు.
"కానీ మా ఇద్దరికి కొన్ని విషయాల్లో వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి నేను దాన్ని ఎలా చూస్తాను అంటే.. మన ఇద్దరికీ ఈ సబ్జెక్ట్ లో పడట్లేదు.. అంతే.. ఆ సబ్జెక్ట్ వరకే.. నీకు నాకు మధ్య కాదు... ఒకవేళ నో చెబితే.. నేను నీకు చెప్పలే.. ఆ విషయానికి నో చెప్పా అంతే" అని చెప్పారు.
అలా చేస్తే.. కచ్చితంగా రిలేషన్ షిప్ బాగుంటుందని, ట్రబుల్స్ ఉండవని అన్నారు. ప్రస్తుతం బన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో బన్నీ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారని నెటిజన్లు చెబుతున్నారు. అలా నంద్యాల పర్యటన విషయంలో తన అభిప్రాయం డైరెక్ట్ గా చెప్పకుండా ఇలా సున్నితమైన ఉదాహరణతో బన్నీ తెలివిగా తేల్చేశారని అంటున్నారు.