Begin typing your search above and press return to search.

పుష్పరాజ్ నో చెప్పిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో..

సినీ ఇండస్ట్రీలో భాషా బేధం క్రమంగా తగ్గిపోతుంది. ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే వేరే భాషలలో చిత్రాలు చేసేవారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 11:30 PM GMT
పుష్పరాజ్ నో చెప్పిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో..
X

సినీ ఇండస్ట్రీలో భాషా బేధం క్రమంగా తగ్గిపోతుంది. ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే వేరే భాషలలో చిత్రాలు చేసేవారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండును మారుస్తూ స్టార్ హీరోలు సైతం పర భాషలో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం బరువు విలన్ రోల్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ విలన్ గా దేవర మూవీ తో వచ్చేస్తున్నాడు. ఇక సినిమాలలో ఒక హీరో వద్దు అనుకున్న చిత్రాన్ని మరొకరు చేయడం కామన్ గా మనకు తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఎప్పుడో బాలీవుడ్ లో సూపర్ డూపర్ ఎంట్రీని మిస్ చేసుకున్నాడు.

అయితే వెరైటీగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో కాదు అనుకున్న చిత్రంతో బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సక్సెస్ సాధించాడు. ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ తన కెరీర్లో ఓ మంచి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఈ విధంగా సల్మాన్ ఖాన్ కి అందించాడు. ఇంతకీ ఆ సినిమా ఏమిటి.. అల్లు అర్జున్ అలాంటి సినిమాని ఎందుకు మిస్ చేసుకున్నాడో తెలుసుకుందాం పదండి..

ఒకప్పుడు హీరోలు ఏ స్టోరీ అయినా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు స్టోరీ తమకు సెట్ అయ్యే విధంగా ఉంటేనే చేయడానికి స్టార్ హీరోలు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే సినిమా కథ మొదట ఒక హీరోకి అనుకోవడం.. అతను వద్దు అనడంతో వేరొక హీరోని అప్రోచ్ అవ్వడం కామన్ గా మారిపోయింది. అలా ఎందరో స్టార్ హీరోలు వద్దు అనుకున్న సినిమాలు చివరకు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అలాంటి కోవలోకే వచ్చే సినిమా భజరంగి భాయిజాన్.

మొదట ఈ చిత్రానికి హీరోగా అల్లు అర్జున్ ని మేకర్స్ అప్రోచ్ అయ్యారట. మూవీ నిర్మాత ఉదయవాణి ఈ చిత్రానికి సంబంధించిన కథను మొదట బన్నీకే వినిపించింది. అయితే అప్పటికే టాలీవుడ్ లో చేతి నిండా సినిమాలు ఉండడంతో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నారు. పైగా తన ఫుల్ ఫోకస్ టాలీవుడ్ పైనే పెట్టాలి అని అల్లు అర్జున్ నిర్ణయించుకోవడంతో ఈ మూవీకి నో చెప్పేసారు.

అనంతరం ఇదే స్టోరీ రజనీకాంత్ చేస్తే బాగుంటుంది అని భావించారట.. కానీ తలైవా ఈ స్టోరీ కి తన ఫిజిక్కి అస్సలు సెట్ కాదు అని తేల్చి చెప్పారు. దీంతో ఫైనల్ గా ఈ మూవీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దగ్గరకు వెళ్ళింది. ఈ మూవీ స్టోరీ ఎంతో నచ్చడంతో సల్మాన్ వెంటనే మూవీకి ఓకే చెప్పారు. అప్పటికే సల్మాన్ తన కెరీర్ లో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అతను ఊహించినట్లుగానే ఈ చిత్రం అతని కెరీర్ కి కొత్త ఊపు తీసుకురావడమే కాకుండా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. 2015లో విడుదలనే ఈ చిత్రం అప్పట్లో 960 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. అలా బన్నీ 2015 లోనే బాలీవుడ్ ఎంట్రీ మిస్ అయిపోయాడు.