Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : రౌడీ బ్రాండ్‌లో పుష్పరాజ్‌, ఆనవాయితీ కంటిన్యూ

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు రోజే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 4:12 AM GMT
పిక్ టాక్‌ : రౌడీ బ్రాండ్‌లో పుష్పరాజ్‌, ఆనవాయితీ కంటిన్యూ
X

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు రోజే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సంద్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేయడం జరిగింది. అక్కడకు అల్లు అర్జున్‌ వెళ్లారు. ప్రీమియర్‌ షోకి అల్లు అర్జున్‌ వెళ్లే ముందు రౌడీ వేర్ ధరించిన ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ఇటీవల విజయ్ దేవరకొండ తనకు పుష్ప టైటిల్‌తో రౌడీ వేర్‌ను పంపించాడు అంటూ అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెల్సిందే. మరోసారి రౌడీ స్టార్‌కి బన్నీ థాంక్స్ చెప్పారు.

కంటిన్యూ ఆనవాయితీ అంటూ రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ పంపిన రౌడీ బ్రాండ్‌ జాకెట్‌ను ధరించి ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. పుష్ప 2 సినిమా ప్రీమియర్‌కి వెళ్లబోతున్న సమయంలో అల్లు అర్జున్‌ షేర్‌ చేసిన ఫోటో కావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్‌ గతంలోనూ విజయ్ దేవరకొండ ప్రేమతో పంపిన రౌడీ బ్రాండ్‌ను వేసుకుని ప్రీమియర్‌కి వెళ్లాడు, అందుకే కంటిన్యూ ఆనవాయితీ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది. అల్లు అర్జున్‌ రౌడీ బ్రాండ్‌ ను మరోసారి ఈ ఫోటోతో ప్రమోట్‌ చేయడం జరిగింది.

థాంక్యూ మై డియర్‌ స్వీటెస్ట్‌ బ్రదర్‌ విజయ్‌ దేవరకొండ అంటూ అల్లు అర్జున్‌ పెట్టిన కామెంట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్‌ అవుతోంది. మెగా ఫ్యామిలీ హీరోలతో పెద్దగా అంటి ముట్టనట్లుగా ఉంటున్న అల్లు అర్జున్‌ ఇతర హీరోల కోసం మాత్రం ప్రత్యేక శ్రద్ద కనబర్చుతున్నారు అంటూ కొందరు మెగా ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు. ఇంతకు ముందే విజయ్ దేవరకొండకు రౌడీ వేర్‌ పంపించినందుకు కృతజ్ఞతలు చెప్పిన బన్నీ మరోసారి కావాలని ఆ ఫోటోను షేర్‌ చేసి విజయ్ దేవరకొండకి కృజ్ఞతలు చెప్పడం అనేది కచ్చితంగా మెగా ఫ్యాన్స్‌ని గిల్లడమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆ వివాదాలను పక్కన పెడితే విజయ్‌ దేవరకొండపై తనకు ఉన్న అభిమానం, ప్రేమను అల్లు అర్జున్‌ మరోసారి ఇలా చూపించారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రౌడీ వేర్‌ ధరించిన అల్లు అర్జున్‌ ఫోటోలను రౌడీ స్టార్‌ ఫ్యాన్స్‌ సైతం తెగ షేర్‌ చేస్తూ లైక్ చేస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ కావడంతో పాటు, పుష్ప గురించిన ముచ్చట్లు పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తున్నాయి. పుష్ప 2 సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో పాటు కొన్ని డైలాగ్స్‌, సీన్స్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.