Begin typing your search above and press return to search.

అమ్మ‌తో బ‌న్నీ అద్భుత‌మైన క్ష‌ణాలు!

న‌టుడిగా బ‌న్నీ ఎంత స‌క్సెస్ అయినా ఎంత సాధించినా త‌ల్లి సంతోషం కంటే ఏది గొప్ప‌ది కాదు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ని కన్న త‌ల్లి మాట‌ల్లో చెప్ప‌లేనంత సంతోషానికి గుర‌వుతున్నారు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 9:53 AM GMT
అమ్మ‌తో బ‌న్నీ అద్భుత‌మైన క్ష‌ణాలు!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప‌-2` తో ఇండియ‌న్ స్టార్ గా స‌రికొత్త రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆరు రోజుల్లోనే 1000 కోట్ల వ‌సూళ్లు సాధించిన మొట్ట మొద‌టి స్టార్ గా అవ‌త‌రించాడు. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇదో చ‌రిత్ర. ఇప్ప‌ట్లో ఈ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌డం కూడా అసాధ్య‌మైన ప‌నే. ఈ విష‌యంలో సుకుమార్ అండ్ కో కూడా ఈ స్థాయి విజయాన్ని న‌మోదు చేస్తుంద‌ని అంచ‌నా వేసి ఉండ‌రు. ఇప్ప‌టికే జాతీయ ఉత్త‌మ న‌టుడిగా పుష్ప సినిమాకే అవార్డు అందుకున్నాడు.

మ‌ళ్లీ `పుష్ప‌-2` తో సైతం జాత‌ర స‌న్నివేశాల‌కే అవార్డు వ‌స్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదంతా ప‌క్క‌న బెడితే తెలుగు సినిమా ప్ర‌పంచ స్థాయిలో చాటిన ఈ స‌త్తాను దేశ రాజ‌ధాని ఢిల్లీ లో మీడియాలో మీట్ ఏర్పాటు చేసి చెప్ప‌డానికి టీమ్ రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 15న అక్క‌డా స‌క్సెస్ వెంట్ సెల‌బ్రేట్ చేస్తున్నారు. నిజంగా ఇది ఎంతో గొప్ప ఐడియా. రాజ‌ధానిలోనే మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి చెబితే సినిమాకి మ‌రింత పేరొస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ తెలుగు సినిమా రాజ‌ధానిలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌లేదు. ఆ ర‌కంగా `పుష్ప‌-2` పేరిట ఇది ఓ రికార్డు గా ఉంటుంది. న‌టుడిగా బ‌న్నీ ఎంత స‌క్సెస్ అయినా ఎంత సాధించినా త‌ల్లి సంతోషం కంటే ఏది గొప్ప‌ది కాదు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ని కన్న త‌ల్లి మాట‌ల్లో చెప్ప‌లేనంత సంతోషానికి గుర‌వుతున్నారు. తాజాగా బ‌న్నీఅమ్మ‌ నిర్మ‌ల‌తో క‌లిసి దిగిన ఓ ఫోటో ని ఇన్ స్టా వేదిక‌గా పంచుకున్నారు.

స‌రిగ్గా ఢిల్లీ మీడియా మీట్ కు ముందు చోటు చేసుకుంది. నిర్మ‌ల ముఖంలో నిండైన న‌వ్వు చూడొచ్చు. త‌న‌యుడి విజ‌యం చూసి ఆ త‌ల్లి మ‌న‌సు సంతోషంతో ఉప్పొగుతుంది. ఎదురుగా ఉన్న బ‌న్నీ ఆ త‌ల్లి సంతోషాన్ని చూసి మురిసిపోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. నిర్మ‌ల పెద్ద‌గా మీడియాలో క‌నిపించ‌రు. సినిమా ఈవెంట్ల‌కు కూడా చాలా రేర్ గానే హాజ‌ర‌వుతారు. సినిమాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ బ‌న్నీ తండ్రి అర‌వింద్ చూసుకుంటారు.