Begin typing your search above and press return to search.

అల్లూ అర్జున్-స్నేహ: ప్రేమతో నిండిన 14 ఏళ్ల ప్రయాణం!

ఇక అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోని బిజీ షెడ్యూల్ మధ్య కుటుంబానికి సమయం కేటాయిస్తూ, పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని నిరూపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   6 March 2025 3:17 PM IST
అల్లూ అర్జున్-స్నేహ: ప్రేమతో నిండిన 14 ఏళ్ల ప్రయాణం!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అల్లు స్నేహ రెడ్డి పెళ్లి చేసుకొని 14 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకథ ఫిల్మీ స్టోరీలా సాగినప్పటికీ, నిజ జీవితంలో ఎన్నో అందమైన క్షణాలను సృష్టించింది. 2011లో వైభవంగా జరిగిన ఈ వివాహానికి టాలీవుడ్ అంతా హాజరైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జంట కపుల్స్ గోల్స్‌ తో హ్యాపీగా ముందుకు సాగుతున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోని బిజీ షెడ్యూల్ మధ్య కుటుంబానికి సమయం కేటాయిస్తూ, పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని నిరూపిస్తున్నాడు.

అల్లు అర్జున్, స్నేహ లవ్ స్టోరీ చాలా స్పెషల్ గా ఉంటుంది. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న బన్నీకి, పూర్తిగా సినీ ప్రపంచానికి సంబంధం లేని స్నేహ రెడ్డి మధ్య ప్రేమ చిగురించిన విధానం సో స్పెషల్ అనే చెప్పాలి. ఒక ఫ్రెండ్ ద్వారా వీరి పరిచయం మొదలై, ప్రేమగా మారి, చివరికి పెళ్లికి దారి తీసింది. అప్పట్లో వీరి పెళ్లి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. తమ బంధాన్ని మరింత బలపరుచుకుంటూ, వివాహానంతరం కూడా ఇదే ప్రేమను కొనసాగిస్తూ, తమ ఫ్యామిలీని మరింత బలంగా నిలబెట్టుకున్నారు.

ప్రస్తుతం బన్నీ కెరీర్ పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన వేళ, ఆయన వ్యక్తిగత జీవితం కూడా అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. సినిమాల్లో ఎంతటి హై యాక్షన్ ఉంటుందో, తన కుటుంబ జీవితం కూడా అంతే ఫుల్ ఎనర్జీగా సాగుతోంది. ఇక అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లే ఈ జంట అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా అభిమానులు వీరి జంటకు స్పెషల్ విషెస్ చెబుతున్నారు.

అయాన్, అర్హ పుట్టిన తర్వాత ఈ జంట మరింత ఫ్యామిలీ బాండింగ్‌ను స్ట్రాంగ్ చేసుకున్నారు. పిల్లల్ని మెచ్చుకుంటూ, వారి ప్రతి చిన్న విషయంలో భాగస్వామ్యం అవుతూ, బన్నీ తన కుటుంబ జీవితం కూడా స్టైలిష్‌గా నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన తన కూతురు అర్హపై చూపించే ప్రేమ అందర్నీ ఆకర్షిస్తోంది.

అల్లు అర్జున్ కెరీర్ పరంగా తాను పాన్ ఇండియా రేంజ్ లో కొనసాగుతున్న వేళ, స్నేహ మాత్రం తమ కుటుంబాన్ని స్ట్రాంగ్‌గా నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తోంది. బన్నీ సక్సెస్ వెనుక స్నేహ పూర్తి మద్దతుగా నిలుస్తుంది. హెల్దీ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలో ఈ జంట నిజంగా ఓ ఉదాహరణ. ప్రతి సందర్భాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ, ప్రేమను పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.