Begin typing your search above and press return to search.

పుష్ప 3 లీడ్… సరికొత్త బజ్

నెక్స్ట్ టాలీవుడ్ నుంచి రాబోయే సినిమాల జాబితాలో మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘పుష్ప 2’ ఉంది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 10:14 AM GMT
పుష్ప 3 లీడ్… సరికొత్త బజ్
X

నెక్స్ట్ టాలీవుడ్ నుంచి రాబోయే సినిమాల జాబితాలో మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘పుష్ప 2’ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ‘పుష్ప 1’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు అందుకున్న నేటితరం మొట్టమొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. ఈ నేపథ్యంలో అతని నుంచి రాబోయే ‘పుష్ప 2’ పైన దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. నార్త్ ఇండియన్ ఆడియన్స్ అయితే ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ ఈ మూవీ షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నారు.

ఆల్ మోస్ట్ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 6న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా థీయాట్రికల్, నాన్ థీయట్రికల్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది. పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్ ని 270 కోట్లకి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. అలాగే థీయాట్రికల్ బిజినెస్ 550 కోట్ల వరకు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బిజినెస్ డీల్స్ చూస్తుంటే సినిమా పైన ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ‘పుష్ప’ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే అల్లు అర్జున్ కన్ఫర్మ్ చేశారు. సుకుమార్ కూడా ఇప్పుడు ‘పుష్ప 3’ కోసం అదిరిపోయే లీడ్ ఇవ్వడానికి సిద్ధం అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో నెక్స్ట్ పార్ట్ కి లీడ్ ని సుకుమార్ రెడీ చేసారంట. త్వరలో ఈ సీక్వెన్స్ షూటింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ లీడ్ కోసం ఒక స్టార్ హీరోని రంగంలోకి దించుతున్నారంట.

‘పుష్ప 3’ చిత్రంలో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా సదరు స్టార్ హీరోని మెయిన్ లీడ్ గా పెట్టే ఆలోచనతో సుకుమార్ ఈ విధంగా క్లైమాక్స్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కచ్చితంగా ఈ లీడ్ అందరికి కనెక్ట్ అవుతుందని, నెక్స్ట్ పార్ట్ పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తోన్న ప్రచారం బట్టి అయితే ‘పుష్ప 3’ చిత్రం బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా వచ్చే ఛాన్స్ ఉందని అర్ధమవుతోంది.

మరి అది ఎంత వరకు పాజిబుల్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ‘పుష్ప 2’ సినిమా అయితే వరల్డ్ వైడ్ గా చాలా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే పార్ట్ 3పైన ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు.