Begin typing your search above and press return to search.

బన్నీని టార్గెట్ చేయడానికి అసలు కారణం ఇదేనా?

మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఇదే జరుగుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Aug 2024 4:05 AM GMT
బన్నీని టార్గెట్ చేయడానికి అసలు కారణం ఇదేనా?
X

మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఇదే జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు ఆ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వైరం ఉందో లేదో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం తమ లిమిట్స్ క్రాస్ మరీ కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతీ క్షణం బన్నీని టార్గెట్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారు. అలా నెట్టింట కొన్ని వందల పోస్టులు కనిపిస్తున్నాయి.

అయితే కొందరు అల్లు అర్జున్ ఆర్మీ కూడా మెగా అభిమానులకు గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. కానీ అనవసరంగా అల్లు అర్జున్ ను కాంట్రవర్సీలోకి లాగుతున్నారని మరికొందరు బాధపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ వార్ కాస్త.. ఇప్పుడు బయటకు వచ్చింది. జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు.. బన్నీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వారు హైలెట్ అవ్వాలని ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు అనేలా మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే మెగా పెద్దలు గాని యువ హీరోలు గాని ముఖ్య నాయకులు ఎవరు పెద్దగా బన్నీ కామెంట్స్ గురించి రియాక్ట్ కావడం లేదు. కానీ కొందరు నాయకులు పనిగట్టుకుని కామెంట్ చేస్తుండడంతో ఫోకస్ లోకి రావడానికి అలా మాట్లాడుతూన్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. రీసెంట్ గా బొలిశెట్టి శ్రీనివాస్, చలమలశెట్టి రమేష్ నోరుపారేసుకున్న విషయం తెలిసిందే.

అసలు అల్లు అర్జున్ కు ఫ్యాన్సే లేరని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇక్కడ కేవలం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారని అన్నారు. ఆ కాంపౌండ్ నుంచి బయటకొచ్చి షామియానా బ్రాంచుల్లా పెటుకున్నారేమో తెలియదని కామెంట్ చేశారు. బన్నీ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మారుతీ నగర్ సుబ్రహణ్యం ఈవెంట్ లో అల్లు అర్జున్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అసలు ఎవరు రమ్మన్నారని పరుషంగా మాట్లాడారు.

ఆ తర్వాత కృష్ణా జిల్లా జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ బాబు.. బన్నీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చారని, వారిని విమర్శించే స్థాయి బన్నీకి లేదని ఆరోపించారు. అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి చిరంజీవి అని, నీడను ఇచ్చిన చెట్టునే అల్లు అర్జున్ విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. పుష్ప-2 రిలీజ్ ను అడ్డుకుంటామని అన్నారు.

అయితే జనసేన పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. నెట్టింట జరుగుతున్న వార్ ను బయటకు జనసేన నేతలే తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని అంటున్నారు. చూస్తుంటే.. హైలెట్ అవ్వడానికి కావాలనే బన్నీపై పబ్లిక్ గా కొందరు జనసేన నేతలు పర్సనల్ ఒపినిఒన్స్ అంటు కామెంట్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు.