Begin typing your search above and press return to search.

సంధ్య థియేటర్ ఘటన... అల్లు అర్జున్ టీమ్ స్పందన ఇదే!

పుష్ప-2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Dec 2024 8:18 AM GMT
సంధ్య థియేటర్ ఘటన... అల్లు అర్జున్ టీమ్ స్పందన ఇదే!
X

అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" సినిమా సందడి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ దారుణం జరిగిన సంగతీ తెలిసిందే. ఇందులో భాగంగా... బుధవారం రాత్రి ప్రీమియర్ షోలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగగా.. అది తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది.

అవును.. పుష్ప-2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తండ్రి చెబుతున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమని తెలిపింది.

ఇందులో భాగంగా.. నిన్న రాత్రి సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరమని.. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. తమ బృందం ఆ కుటుంబాన్ని కలిసి, అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అని తెలిపింది.

కాగా... పుష్ప-2 ప్రీమియర్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి వచ్చిన అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో... వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ తొక్కిసలాటలో రేవతి (35) మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ (9) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.