పుష్ప రాజ్ హీరోయిన్ లెక్క తెలట్లేదా..?
ఐతే చిత్ర యూనిట్ మాత్రం సినిమాపై వస్తున్న ఈ వార్తలకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు.
By: Tupaki Desk | 30 March 2025 2:30 AMపుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషన్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా మరో పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీతో లాక్ చేసుకున్నాడు. అంతకుముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అట్లీ అల్లు అర్జున్ కోసం కూడా ఒక అద్భుతమైన కథ రాసుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యుయల్ రోల్ అని మొన్నామధ్య వినిపించిన టాక్. ఐతే చిత్ర యూనిట్ మాత్రం సినిమాపై వస్తున్న ఈ వార్తలకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు.
త్వరలోనే సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని టాక్. ఈ సినిమాను వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా టూ ఇయర్స్ లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ మూవీ భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. సినిమా కోసం అల్లు అర్జున్ బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని చెబుతున్నారు. ఐతే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో ఓకే అవ్వగా ఇక హీరోయిన్ గురించి వేట మొదలు పెట్టారని తెలుస్తుంది.
సౌత్ డైరెక్టర్ సౌత్ హీరో కాబట్టి కచ్చితంగా సౌత్ హీరోయిన్ నే తీసుకుంటారన్న టాక్ నడుస్తుంది. ఐతే డేట్స్ ఇష్యూ లేకుండా ఈ రెండేళ్లు తాము అడిగినప్పుడు షూట్ కి వచ్చే వీలున్న హీరోయిన్ ని మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నారు. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ అంటున్నారు కానీ ఒకటే కథ అయినా పుష్ప రెండు భాగాల్లో అల్లు అర్జున్, రష్మికని చూసేశారు ఆడియన్స్.
సో ఈ సినిమాలో రష్మిక ఉండే ఛాన్స్ లేదు. కన్నడ భామ రుక్మిణి వసంత్ ని తీసుకోవాలని అనుకోగా ఆమె ప్రశాంత్ నీల్ ఎన్ టీ ఆర్ సినిమాకు లాక్ అయ్యింది. శ్రీలీల కూడా బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. ఐతే బీ టౌన్ హీరోయిన్స్ లో ఎవరైనా తీసుకుంటారా అన్న కన్ ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎలాగు దేవర తో తారక్ కు, పెద్దితో చరణ్ కు జతగా జాన్వి నటిస్తుంది. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ తో ఆమెకు జోడీ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. మొత్తానికి అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
సినిమాను త్వరలోనే మొదలు పెట్టి త్వరగా పూర్తి చేసి ఏడాది కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అట్లీతో సినిమా ముగించుకున్న తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో ఒక మైథలాజి బ్యాక్ డ్రాప్ మూవీ రాబోతుంది. ఆ కాన్సెప్ట్ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని టాక్.