టెలివిజన్ టాప్ TRP రికార్డ్.. మళ్ళీ బన్నీనే కొట్టాలి!
అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో సినిమా ఇప్పటికీ టెలివిజన్‌లో నెంబర్ వన్ TRP రికార్డును 29.4తో కొనసాగిస్తోంది.
By: Tupaki Desk | 23 Jan 2025 2:37 PM GMTటాలీవుడ్‌లో సినిమా హవా థియేటర్లలో మాత్రమే కాదు, టెలివిజన్‌లో కూడా అదరగొడుతోంది. సాంకేతికత పెరిగినా, డిజిటల్ మాధ్యమాలు ఎన్ని వచ్చినా, టీవీ ప్రేక్షకులు ఇంకా మంచి సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు. అయితే టెలివిజన్‌లో టాప్ TRP రేటింగ్ సాధించిన చిత్రాల లిస్ట్ చూస్తే, అల్లు అర్జున్ సినిమాలే మూడు ఉండడం విశేషం. అతని క్రేజ్ మామూలుగా లేదని ఈ రికార్డ్ మరోసారి నిరూపిస్తోంది.
లేటెస్ట్‌గా పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. థియేటర్లలో 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు టీవీలో కూడా అత్యధిక TRP సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే పుష్ప 1 సినిమాకు టెలివిజన్ రేటింగ్‌లో 25.2 TRP రావడం ద్వారా ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎంతగానో మద్దతు ఇచ్చారనేది స్పష్టమైంది. పుష్ప 2 - ది రూల్ కూడా అదే రేంజ్‌లో టీవీ రేటింగ్స్ సాధించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో సినిమా ఇప్పటికీ టెలివిజన్‌లో నెంబర్ వన్ TRP రికార్డును 29.4తో కొనసాగిస్తోంది. ఇది ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఏ సినిమాకు రాని ఘనత. ఈ సినిమాలో బన్నీ నటన, తమన్ సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే బన్నీ మరో సినిమా దువ్వాడ జగన్నాధం కూడా 21.7 TRPతో ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉంది.
మరోవైపు మహేశ్ బాబు నటించిన సరిలేరు నికెవ్వరు 23.4 TRPతో మూడో స్థానంలో ఉంది. ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలానే బాహుబలి 2 కూడా టెలివిజన్‌లో 22.7 TRP సాధించి టాప్ లిస్ట్‌లో నిలిచింది. ఇక రాబోయే రోజుల్లో పుష్ప 2 OTT లో మాత్రమే కాకుండా టెలివిజన్ వరల్డ్ లో రికార్డు స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టాప్ TRP రికార్డులో ఉన్న ఈ చిత్రాలను బన్నీనే మళ్లీ కొట్టగలడు అనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మరి ఫ్యాన్స్ కోరిక ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
టెలివిజన్ టాప్ TRP రేటింగ్స్
1. అల.. వైకుంఠపురములో - 29.4
2. పుష్ప: ది రైస్ - 25.2
3. సరిలేరు నికెవ్వరు - 23.4
4. బాహుబలి 2 - 22.7
5. దువ్వాడ జగన్నాథం - 21.7