మహిళ మృతి కేసు.. హైకోర్టుకు అల్లు అర్జున్..
అయితే ఈ కేసు నుంచి తనను తొలగించాల్సిందిగా అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారని తెలిసింది.
By: Tupaki Desk | 11 Dec 2024 3:53 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సూపర్ సక్సెస్ ని ఆస్వాధిస్తున్నాడు. కేవలం హిందీ బాక్సాఫీస్ వద్ద వారం రోజుల్లో 400 కోట్ల మార్క్ ను తాకుతోంది. ఓవరాల్ గా 600 కోట్ల నెట్ (సుమారు 1000 కోట్ల గ్రాస్) వసూళ్లను అధిగమించి దూసుకెళుతోంది. అయితే ఓ వైపు విజయానందంలో ఉన్న అల్లు అర్జున్ కి కోర్టు కేసు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇటీవల సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి కారణం అల్లు అర్జున్ థియేటర్ సందర్శన సమయంలో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమేనని పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ సహా థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసు నుంచి తనను తొలగించాల్సిందిగా అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారని తెలిసింది. తదుపరి కోర్టులో అతడి పిటిషన్ విచారణకు రానుంది.
దేశవ్యాప్త పర్యటనకు ప్లాన్..
మరోవైపు పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రజలను కలిసేందుకు అల్లు అర్జున్ భారీ ప్రణాళికలను సిద్ధం చేసారని తెలుస్తోంది. నేషనల్ టూర్ ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఐకాన్ స్టార్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తొలిగా థాంక్స్ మీట్ ఈనెల 12న న్యూ ఢిల్లీలో జరుగుతుంది. దిల్లీ తర్వాత ఉత్తరాదిన ఉన్న పలు మెట్రో నగరాలు, దక్షిణాదిన ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో తిరిగి ప్రేక్షకాభిమానులకు బన్ని కృతజ్ఞతలు తెలియజేస్తారు. అలాగే చివరి థాంక్స్ మీట్ హైదరాబాద్‌లో జరగనుందని, దుబాయ్‌లోను సక్సెస్ మీట్ ని నిర్వహించనున్నారని సమాచారం.
అల్లు అర్జున్ - రష్మిక మందన్న- ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో నటించిన 'పుష్ప 2' పాన్ ఇండియన్ కేటగిరీలో అసాధారణ విజయం సాధించింది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మొత్తం టీమ్ దేశవ్యాప్త పర్యటనకు వెళుతోందని సమాచారం.