Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వాహ్! అల్లు అర్జున్ నుండి ఎంత మేకోవర్

అత‌డు పూర్తిగా త‌న త‌దుప‌రి సినిమా కోస‌మే కేటాయిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 4:10 PM GMT
ఫోటో స్టోరి: వాహ్! అల్లు అర్జున్ నుండి ఎంత మేకోవర్
X

అవును... పుష్ప‌రాజ్ ల‌వ‌ర్ బోయ్ లా మారాడేమిటీ? ఉన్న‌ట్టుండి ఏమిటీ స్ట‌న్నింగ్ మేకోవ‌ర్..! చాక్లెట్ బోయ్.. ల‌వ‌ర్ బోయ్ లా.. కాలేజ్ గోయింగ్ టీనేజీ బోయ్ లా మారాడు! ఇంత‌లోనే ఎంత‌టి మార్పు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని మార్పు. చూస్తుంటే ఈసారి మాంచి రొమాంటిక్ డ్రామాలో న‌టిస్తున్నాడనే అర్థ‌మ‌వుతోంది. అత‌డు పూర్తిగా త‌న త‌దుప‌రి సినిమా కోస‌మే కేటాయిస్తున్నాడు.


దీనికోస‌మేనా ఈ మేకోవ‌ర్? దాదాపు ఐదేళ్ల పాటు కేవ‌లం `పుష్ప` ఫ్రాంఛైజీ కోస‌మే అల్లు అర్జున్ అంకిత‌మయ్యాడు. త‌న స్టైలిష్ అవ‌తార్ ని వ‌దిలేసి, పూర్తిగా ర‌గ్గ్ డ్ మాస్ అవ‌తార్ కి షిఫ్ట‌య్యాడు. అయితే త‌న రూపం, న‌ట‌న‌, ఆహార్యం ప్ర‌తిదీ త‌న‌కు క‌లిసొచ్చి ఏకంగా జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు ద‌క్కింది. పుష్ప‌రాజ్ గా అత‌డి న‌ట‌న‌కు ప్ర‌పంచం ఫిదా అయింది. జాతీయ, అంత‌ర్జాతీయ గుర్తింపుతో పాటు ఇప్పుడు అత‌డి మార్కెట్ రేంజ్ స్కైని ట‌చ్ చేసింది.


ఇటీవ‌ల‌ రా అండ్ ర‌గ్గ్ డ్ లుక్ ని వ‌దిలేసి బ‌న్ని ఉన్న‌ట్టుండి చాక్లెట్ బోయ్ లా మారిపోయాడు. పుష్ప‌రాజ్ గెట‌ప్ లో ఏజ్డ్ గా క‌నిపించిన బ‌న్ని ఇప్పుడు పూర్తిగా స్మార్ట్ లుక్ తో చాలా వ‌ర‌కూ ఏజ్ త‌గ్గించుకుని క‌నిపించాడు. కూల్ గా స్టైలిష్ ఐకాన్ లాగా కనిపిస్తున్నాడు. ఈ కొత్త మేకోవర్‌లో అతడిలోని స్పార్క్ ని చూడ‌గానే ఫ్యాన్స్ ఫుల్ కిక్ లో ఉన్నారు.ఈ రూపం పూర్తి కొత్తగా ఉందని ప్ర‌శంసిస్తున్నారు. దీనికోసం బ‌న్ని చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. అత‌డు ఇటీవ‌ల‌ బాగా స్లిమ్ అయ్యాడు. కొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో స్టైలింగ్ చేయించుకున్నాడు. ఈ క్యాజువల్ న్యూ లుక్ అతడికి బాగా యాప్ట్ అయింది. స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు త‌గ్గ‌ట్టుగా త‌న లుక్ మారింది. పుష్ప‌రాజ్ గెట‌ప్ వ‌దిలేసి ఉన్న‌ట్టుండి ఈ లుక్ లో క‌నిపించ‌గానే చాలామంది క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. మొత్తానికి కొత్త గెట‌ప్ లో అల్లూ హీరో అదిరిపోయాడు.

ఈ గెటప్ చూశాక చాలా సందేహాలు..ఇదంతా అతడి కొత్త సినిమాకోస‌మేనా? అంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మ‌రోసారి అల్లు అర్జున్ ని స్టైలిష్ అవ‌తార్ లో ప్రెజెంట్ చేయ‌బోతున్నాడని అంచ‌నా వేస్తున్నారు. అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత మ‌రో క్లాసిక్ ని తీయ‌డానికి బ‌న్నీని ఇలా మార్చేశాడ‌ని భావిస్తున్నారు. త్రివిక్ర‌మ్, అట్లీ స‌హా ప‌లువురు టాప్ ద‌ర్శ‌కుల‌తో బ‌న్ని ప‌ని చేయాల్సి ఉండ‌గా మారిన ఈ రూపం ఏ ప్రాజెక్ట్ కోస‌మో తొంద‌ర్లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తున్నారు.