ఇండియా షేక్ అయ్యేలా ఐకాన్ స్టార్ తో త్రివిక్రమ్!
అయితే ఇంత వరకూ దీనిపై ఎలాంటి అధికారిక సమా చారం లేదు.
By: Tupaki Desk | 25 March 2025 5:59 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇది ఓ మైథలా జికల్ స్టోరీ అని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత వరకూ దీనిపై ఎలాంటి అధికారిక సమా చారం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రాజెక్ట్ గురించి నిర్మాత నాగవంశీ అధికారిక సమాచారం అందించారు 'సీనియర్ ఎన్టీఆర్ టైమ్ నుంచి మైథలాజికల్ సినిమాలకు పెట్టింది పేరు.
ప్రస్తుతం ఎందుకనో ఆ జానర్ లో సినిమాలు తగ్గాయి? అన్న ప్రశ్నకు తెలుగులో మైథలాజికల్ సినిమాలు తీయకపోవడానికి కారణం నాకు తెలియదు. కానీ అల్లు అర్జున్- త్రివిక్రమ్ గారి సినిమా మైథలాజికల్ స్టోరీ. భారతదేశం అంతా ఆశ్చర్యపో యేలా ఉంటుంది. రామాయాణం, మహాభారతం వంటి ప్రసిద్ద ఇతిహాసాల మీద కాకుండా ఎవరికీ తెలియని మైథలాజికల్ కథను ఆధారంగా చేసుకున్నాం.
ఇది పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది. పురాణాల్లో ఎవరికీ తెలియని ఓ గాడ్ కథ. ఆ గాడ్ పేరు విన్నా ఆయన వెనుక ఉన్న కథ ఎవరికీ తెలియదు. దాని ఆధారంగానే మేము సినిమాను రూపొందిస్తున్నాం' అన్నారు. దీంతో ఈ సినిమాపై అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభ మవుతుంది? అన్నది రివీల్ చేయలేదు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రమిది. ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారు. ఈ చిత్రాన్ని హాసిని-హారికా క్రియేషన్స్ నిర్మిస్తుంది. గీతా ఆర్స్ట్ సమర్పిస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దుబాయ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే ప్రారంభోత్సవం, రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా 2026 లో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ కూడా పట్టాలెక్కిస్తారా? అన్నది చూడాలి.