బన్నీతో త్రివిక్రమ్ యుద్దం చరిత్రను తిరగరాసేలా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాకి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 March 2025 5:00 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాకి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మైథలాజికల్ స్టోరీ అని లీకైంది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన కాన్సెప్ట్ లకు పూర్తి భిన్నమైన సినిమా ఇది. రాజులు, రాణులు, గొప్ప కోటలు అంటూ ఓకల్పిత కథను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కథకు మూలం ఏంటి? చరిత్రలో ఎలాంటి అంశాలను ప్రామాణికంగా చేసుకుని స్టోరీ సిద్దం చేసారు? అన్నది తేలాల్సిన అంశం.
ఏది ఏమైనా ఇలాంటి అటెంప్ట్ త్రివిక్రమ్ కొత్తది. దీంతో ఈ కథను గురూజీ ఎలా చెప్పబోతున్నాడు? అన్నది అంతే ఆసక్తికరంగా మారుతోంది. కానీ తనతో సహా ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడు? అన్నది వాస్తవం. ఎలాంటి కథలోనైనా గురూజీ అద్భుతమైన డ్రామాను చెప్పగలడు. యాక్షన్ పరంగానూ తానో స్పెషలిస్ట్ . రెగ్యులర్ యాక్షన్ కాకుండా కొత్తగా ట్రై చేయడం అలవాటు.
ఈసారి ఎంపిక చేసుకుంది మైథలాజికల్ టచ్ ఉన్నస్టోరీ కాబట్టి అందులోనూ పాన్ ఇండియాలో తీస్తున్న సినిమా కాబట్టి వంద శాతం సరికొత్త అనుభూతినే పంచుతుంది. కల్పిత కాలం నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకులందుతున్నాయి. సినిమాలో భారీ యుద్ద సన్నివేశా లుంటాయంటున్నారు. తెరపై కనిపించే ప్రతీ పాత్ర లో వైవిత్యత ఉంటుందని..అన్నింటా త్రివిక్రమ్ మార్క్ ఇన్నోవేషన్ కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం గురూజీ కథకు తుది మెరుగులు దిద్దుతున్నారుట. ఈ సినిమా చిత్రీకరణకే త్రివిక్రమ్ ఏడాది న్నర కేటాయిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ..అట్లీకి ఏడాదిలో షూటింగ్ పూర్తి చేయాలని కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా ప్రారంభించాలనే బన్నీ ఈ కండీషన్ పెట్టాడు. అంటే గురూజీ చిత్రం ప్రారంభమయ్యేది 2026లోనేనని తెలుస్తోంది.