Begin typing your search above and press return to search.

గురూజీ కూడా స్ట్రాట‌జీ అప్లై చేస్తున్నాడా?

ఏడాది గ్యాప్లో కొత్త హీరోతో సినిమా చేయ‌డం కంటే? మొద‌టి భాగానికి మెరుగులు దిద్ద‌డం స‌హా పార్ట్ 2 సిద్దం చేసి పెట్టుకుంటే?

By:  Tupaki Desk   |   13 March 2025 3:00 AM IST
గురూజీ కూడా స్ట్రాట‌జీ అప్లై చేస్తున్నాడా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ కాంబినేష‌న్ దాదాపు లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. స‌మ్మ‌ర్ త‌ర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి ఎలా లేదాన్నా? ఏడాది నుంచి ఏడాదిన్నర స‌మ‌యం ప‌డుతుంది. మ‌రి ఈలోపు త్రివిక్ర‌మ్ ఏం చేస్తారు? అంటే? ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపు గురూజీ ఓ యంగ్ హీరోతో సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే ఇప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమా చేయ‌డం కంటే? బ‌న్నీ కోసం రాసిన స్క్రిప్ట్ పైనే మ‌రింత వ‌ర్క్ చేసే దిశ‌గా అడుగులు పడుతున్న‌ట్లు స‌న్నిహితుల నుంచి లీకులందుతున్నాయి. ఇప్ప‌టికే బ‌న్నీ కోసం రాసిన క‌థ మైథ‌లాజిక‌ల్ స్టోరీ అని తేలిపోయింది. అయితే ఈ క‌థ ఒక భాగం కాదు.. రెండు భాగాలుగా తెర‌కెక్కిం చాల‌ని గురూజీ భావిస్తున్నారుట‌. మొద‌టి భాగం స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యింది. త్రివిక్ర‌మ్ క‌థ‌లంటే క‌థ‌, కథ‌నం, మాట‌లు అన్నీ ఆయ‌నే రాసుకుంటాడు.

ఇత‌ర రైట‌ర్ల‌పై ఆధార‌ప‌డ‌రు. అయితే ఈ సినిమా స్టోరీ రాసే స‌మ‌యంలో రెండ‌వ భాగానికి సంబంధించి లీడ్స్ కూడా సిద్దం చేసుకుని పెట్టుకున్నాడుట‌. రెండ‌వ భాగానికి సంబంధించి స్టోరీ సిద్దం కాలేదు గానీ.. .లీడ్స్ వ‌ర‌కూ వ‌దిలి పెట్టారుట‌. అయితే బ‌న్నీ-అట్లీ సినిమా రిలీజ్ అయ్యేలోపు రెండ‌వ భాగం క‌థ కూడా సిద్దం చేయాల‌న్నది తాజా ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది.

ఏడాది గ్యాప్లో కొత్త హీరోతో సినిమా చేయ‌డం కంటే? మొద‌టి భాగానికి మెరుగులు దిద్ద‌డం స‌హా పార్ట్ 2 సిద్దం చేసి పెట్టుకుంటే? ఇంకా మెరుగైన ఫ‌లితాలు సాధించొచ్చు అన్న ఆలోచ‌న‌తో మూవ్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలంటే అన్నీ రెండు భాగాలుగానే రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక భాగంలో పూర్తి క‌థ‌ను చెప్ప‌కుండా? ఒకే క‌థ‌ని రెండు భాగాలు చేసి కోట్ల వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్ట‌డం అన్న‌ది ట్రెండ్ గా మారింది. గురూజీ కూడా అదే స్ట్రాట‌జీతో ముందుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.