బన్నీ.. ఒకేసారి రెండు టార్గెట్లు!
సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బన్నీకి పాన్ ఇండియా స్టార్‌డమ్ ముద్ర వేసింది.
By: Tupaki Desk | 27 March 2025 10:04 AMస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌ను 'పుష్ప 2' మరో ఎత్తుకు తీసుకెళ్లింది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బన్నీకి పాన్ ఇండియా స్టార్‌డమ్ ముద్ర వేసింది. అయితే ఈ రెండు భాగాల 'పుష్ప' కోసం బన్నీ దాదాపు ఐదేళ్ల సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఇది ఆయనకు స్టార్ హీరోగా ఉండే అత్యున్నత సమయంలో చాలా ఎక్కువ టైం. ఇప్పుడు అదే లోటును భర్తీ చేయడానికి బన్నీ పూర్తిగా స్పీడ్ మోడ్‌లోకి మారిపోయారు.
పుష్ప 2 విజయంతో పాటు వచ్చిన వన్ మేన్ మాస్ ఇమేజ్‌ను ఉపయోగించుకుంటూ, అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులకు క్లియర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా అట్లీ డైరెక్షన్‌లో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు కమిట్ అయ్యాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇది పూర్తిగా మాస్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించనున్న చిత్రంగా తెలుస్తోంది.
ఇప్పటికే నిర్మాత నాగవంశీ త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. “అల్లు అర్జున్ గారు రెండు సినిమాలను ఒకేసారి ప్లాన్ చేయాలనుకున్నారు. మేము మా షూటింగ్ షెడ్యూల్‌ను కూడా అలా ప్లాన్ చేస్తున్నాం. త్రివిక్రమ్ గారి సినిమా 2025 ద్వితీయార్థంలో స్టార్ట్ అవుతుంది,” అంటూ వెల్లడించారు. అంటే అట్లీ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే త్రివిక్రమ్ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా, రెండింటినీ సమాంతరంగా చేయాలన్నది బన్నీ ఫిక్స్ చేసిన డెడ్‌లైన్.
ఇది చూస్తే బన్నీ గతంలో చేసిన తప్పును మళ్లీ చేయకుండా, మార్కెట్‌ను పూర్తిగా క్యాష్ చేసుకునే దిశగా దూసుకెళ్తున్నాడనే విషయం స్పష్టమవుతోంది. స్టార్ హీరోగా ఉన్న సమయంలో ఎక్కువ సినిమాలు చేయడం, ఎక్కువ మార్కెట్ బేస్ సెట్ చేసుకోవడం ఇప్పుడు అవసరమైనది. ‘పుష్ప 2’ తో వచ్చిన మ్యానరిజమ్, క్రేజ్‌ను కాపాడుకోవాలంటే కన్సిస్టెంట్‌గా సినిమాలు విడుదల చేయాల్సిన అవసరం బన్నీకి ఉంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. అట్లీ సినిమా కూడా బన్నీ సిగ్నల్ ఇవ్వగానే సెట్స్‌పైకి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు 2025లో బ్యాక్ టు బ్యాక్ బన్నీని పాన్ ఇండియా స్టార్‌గా మరింత ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలున్నాయి. అన్ని విషయాల్లో క్లారిటీ, కంట్రోల్ ఉన్న బన్నీకి ఇప్పుడు తక్కువ టైమ్‌లో ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రయత్నంలో అతని మార్కెట్ రేంజ్, అలాగే హీరోగా క్రేజ్.. ఇంకా ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.