పఠాన్ (X) పుష్పరాజ్: సౌత్‌ని కొల్లగొట్టే ప్లాన్?
ఇంతలోనే ఇప్పుడు మరో గాసిప్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
By: Tupaki Desk | 17 March 2025 9:57 AM ISTపాన్ ఇండియా సినిమాల ట్రెండ్ దేశవ్యాప్తంగా భారీ కాంబినేషన్లకు తెర తీసింది. బాలీవుడ్ లోను కాస్టింగ్ ఎంపికల సరళి మారిపోయింది. ఇది ఉత్తరాది దక్షిణాది స్టార్ల కలయికలో భారీ మల్టీస్టారర్లకు దారి తీసింది. ఇందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ బ్యానర్ నిర్మిస్తున్న 'వార్ 2'లో అవకాశం అందుకున్నాడు. వైఆర్ఎఫ్ తన స్పై యూనివర్శ్ ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు బాలీవుడ్ అగ్రహీరోలతో సౌత్ పాన్ ఇండియన్ స్టార్లను కలుపుతూ భారీ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తోంది.
'వార్ 2' హృతిక్- ఎన్టీఆర్ కలయికలో వస్తోంది. ఇది ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతలోనే ఇప్పుడు మరో గాసిప్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ రూపొందించనున్న 'పఠాన్-2' లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని విలన్ గా నటింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయనేది ఈ గాసిప్ సారాంశం. కింగ్ ఖాన్ షారూఖ్ 'పఠాన్' చిత్రంతో 1000 కోట్ల క్లబ్ అందుకున్నాడు. ఇప్పుడు పఠాన్ సీక్వెల్ తో పాన్ ఇండియాలో మరో భారీ విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దీనికోసం పష్పరాజ్ పాత్రలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ని విలన్ గా ఎంపిక చేయాలని యష్ రాజ్ బ్యానర్ భావిస్తున్నట్టు కథనాలు వేడెక్కిస్తున్నాయి.
అయితే దీనిని వైఆర్ఎఫ్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. పఠాన్ లో జాన్ అబ్రహాం విలన్ గా నటించాడు. అతడి నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు సీక్వెల్ లో పుష్పరాజ్ అలియాస్ బన్ని ఎంట్రీ ఇస్తే అది సౌత్ ఆడియెన్ కి మరో లెవల్ ట్రీట్ గా మారుతుంది. తద్వారా దక్షిణాది నుంచి భారీగా వసూళ్లను కొల్లగొట్టాలనే ప్లాన్ యష్ రాజ్ బ్యానర్ కి ఉంది. అందుకే అల్లు అర్జున్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. యష్ రాజ్ స్పై వర్స్ లో చేరడం అల్లు అర్జున్ కి కూడా అదనపు మైలేజ్ ని పెంచుతుందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే అతడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు షారూఖ్ తో కలిసి నటిస్తే అది అతడి స్థాయిని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. అయితే YRF నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే షారూఖ్, అల్లు అర్జున్ అభిమానులకు నెవ్వర్ బిఫోర్ ట్రీట్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 1000 కోట్ల క్లబ్ నుంచి 2000 కోట్ల క్లబ్ లోకి స్థిరంగా ఎదగడానికి ఇలాంటి ఎంపిక అవకాశం కల్పిస్తుంది.