Begin typing your search above and press return to search.

బ‌న్నీతో మాట్లాడిన అట్లీ ఎందుకో తెలుసా?

అయితే స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో వ‌రుణ్ ధావ‌న్, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన `బేబిజాన్` ఈనెల 25న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   19 Dec 2024 5:29 AM GMT
బ‌న్నీతో మాట్లాడిన అట్లీ ఎందుకో తెలుసా?
X

పాన్ ఇండియాలో `పుష్ప‌-2` వ‌సూళ్ల సునామీ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా 1500 కోట్ల వ‌సూళ్ల‌కు చేరువ‌లో ఉంది. ఆ సినిమాకు పోటీగా మరో సినిమా కూడా లేక‌పోవ‌డంతో పుష్ప మేనియా కొన‌సా గుతుంది. బాలీవుడ్ లోనే 600 కోట్ల వ‌సూళ్ల‌ను ఇప్ప‌టికే రాబ‌ట్టింది. `బాహుబ‌లి-2`, `దంగ‌ల్` రికార్డులు సైతం తిర‌గ‌రాస్తుందా? అన్న అంచ‌నాలున్నాయి. అయితే స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో వ‌రుణ్ ధావ‌న్, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన `బేబిజాన్` ఈనెల 25న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది.

క‌లీస్ దర్శ‌క‌త్వం వ‌హించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కి అట్లీ ర‌చ‌న‌తో పాటు నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే సినిమాపై ప్ర‌త్యేక‌మైన బ‌జ్ క్రియేట్ అవుతుంది. ఇంత వ‌ర‌కూ బాక్సాఫీస్ వ‌ద్ద అట్లీ సినిమాలు ఫెయిలైంది లేదు. అన్నీ భారీ విజ‌యాలు సాధించాయి. షారుక్ తో తెర‌కెక్కించిన `జ‌వాన్` బాక్సాఫీస్ ని షేక్ చేసింది. దీంతో బేబీజాన్ `పుష్ప‌-2`కి పోటీగా మారుతుందని ఆ సినిమా వ‌సూళ్ల పై ప్ర‌భావం చూపిస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ ప్ర‌చారంపై అట్లీ స్పందించారు. ప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడూ ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణ‌మే ఉంటున్నారు. బ‌న్నీ-తాను మంచి స్నేహితులం అని, `పుష్ప‌2 డిసెంబ‌ర్ మొద‌టి వారంలో రిలీజ్ అయింది. మా సినిమా నాల్గ‌వ వారంలో వ‌స్తుంది. అలాంట‌ప్పుడు పోటీ ఎలా అవుతుంది అని ప్ర‌శ్నించారు. అన్ని విష‌యాలు ఆలోచించే `బేబీజాన్` రిలీజ్ తేదీని ఫిక్స్ చేసాం. మా సినిమా విజ‌యం సాధించాల‌ని బ‌న్నీ కోరుకుంటున్నారు.

మా టీమ్ ని విష్ చేసారు. నాతో , వ‌రుణ్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. మేమంతా ఎంతో పాజిటివ్ గా ఉన్నామ‌ని అట్లీ తెలిపారు. దీంతో రిలీజ్ విష‌యంలో `బేబీ జాన్` టీమ్ ఎక్క‌డా జంక‌లేద‌ని అర్ద‌మ‌వుతుంది. నాల్గ‌వ వారం రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి అంత ప్ర‌భ‌వం సినిమాపై ఉండ‌దు. సినిమాకు హిట్ టాక్ వస్తే? `బేబిజాన్` మంచి వ‌సూళ్లు సాధించే అవ‌కాశం ఉంది. అయితే `పుష్ప‌-2` తో పాటు మ‌రో బాలీవుడ్ సినిమా ఛావా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు ఛావాకి ద‌క్క‌క్క‌పోవడంతో ఆ సినిమా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.