Begin typing your search above and press return to search.

చరణ్ కి ఏకైక మేనమామని నేను..!

ఇక ఇదే ప్రెస్ మీట్ లో ఈమధ్య రాం చరణ్ గురించి తను మాట్లాడిన తీరు మెగా అభిమానులను హర్ట్ చేసిందన్న విషయాన్ని కనిపెట్టిన అల్లు అరవింద్ ఈ ప్రెస్ మీట్ లో దాని గురించి కూడా స్పందించారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 12:44 PM GMT
చరణ్ కి ఏకైక మేనమామని నేను..!
X

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా హెచ్.డి ప్రింట్ పైరసీ అవ్వడం దాన్ని ఏపీలో కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సుల్లో కూడా టెలికాస్ట్ చేయడం పట్ల ఆ చిత్ర నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఇక ఇదే ప్రెస్ మీట్ లో ఈమధ్య రాం చరణ్ గురించి తను మాట్లాడిన తీరు మెగా అభిమానులను హర్ట్ చేసిందన్న విషయాన్ని కనిపెట్టిన అల్లు అరవింద్ ఈ ప్రెస్ మీట్ లో దాని గురించి కూడా స్పందించారు.

ఈమధ్య ఒక ఈవెంట్ లో దిల్ రాజు గారిని స్టేజ్ మీదకు ఆహ్వానించే టైం లో రామ్ చరణ్ ని తగ్గించానని ట్రోల్ చేశారు.. ఆ టైంలో రిపోర్టర్ అడిగితే అది కరెక్ట్ టైం కాదని మళ్లీ చెబుతా అని అన్నాను.. దానికి ఇప్పుడు వివరణ ఇస్తున్నా.. దిల్ రాజుని ఆహ్వానిస్తూ వారంలోనే ఎన్నో కష్టాలు నష్టాలు ఇన్కం ట్యాక్స్ ల గురించి చెబుతూ యదాలాపంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా ఆ మాట వచ్చింది. దానికి మెగా అభిమానులు ఫీల్ అయ్యి దానికి నన్ను ట్రోల్ చేశారు.

ఐతే ఈ సందర్భంగా ఫీలైన అభిమానులకు చెప్పేది ఏంటంటే అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు చరణ్ నా ఒక్కగానొక్క మేనల్లుడు.. అతనికి ఏకైక మేనమామ నేను అందుకే ఎమోషనల్ గా చెబుతున్నా ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. చరణ్ నా కొడుకు లాంటివాడు.. నాకు చరణ్ కి ఉండే రిలేషన్ షిప్ ఎక్సలెంట్.. అందుకని మమ్మల్ని వదిలేయండి. అది కేవలం పొరపాటున దిల్ రాజు లైఫ్ గురించి చెబుతూ నేను అలా చెప్పాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అని అన్నారు అల్లు అరవింద్.

అల్లు అరవింద్ రామ్ చరణ్ సినిమాపై చేసిన వ్యాఖ్యలు అది డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా అయినా సరే మెగా ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేశాయి. ఐతే మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా ఏదైనా ఇలాంటి ఇష్యూ మొదలవుతున్న టైం లో అల్లు అరవింద్ తెలివిగా డీల్ చేస్తారు. ఐతే చరణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ కు లేటెస్ట్ ప్రెస్ మీట్ తో క్లారిటీ ఇచ్చారు.