Begin typing your search above and press return to search.

అల్లు వారి సంస్థ.. మొత్తం ప్లాన్ ఛేంజ్!

అయితే హైదరాబాద్ లో కొన్నేళ్ల క్రితం అల్లు ఫ్యామిలీ.. అల్లు స్టూడియోస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Aug 2024 12:30 AM GMT
అల్లు వారి సంస్థ.. మొత్తం ప్లాన్ ఛేంజ్!
X

సినీ నిర్మాణ రంగంలో అల్లు కుటుంబం కొన్నేళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దివంగత అల్లు రామలింగయ్య కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలోనే గీతా ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అరవింద్. ఆ బ్యానర్ పై అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ స్టార్ట్ చేసి చిత్రాలు తీస్తున్నారు. దాని బాధ్యతలు అన్నీ కూడా నిర్మాత బన్నీ వాసు చూసుకుంటున్నారు.

అయితే హైదరాబాద్ లో కొన్నేళ్ల క్రితం అల్లు ఫ్యామిలీ.. అల్లు స్టూడియోస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా 2022లో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కుటుంబసభ్యులు ప్రారంభించారు. అప్పుడు అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోగా మారి, సినిమాల షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ అవసరాలన్నింటినీ అల్లు స్టూడియో తీరుస్తుందని అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ప్రారంభోత్సవ రోజు ప్రకటించారు.

కాగా, ఇప్పుడు స్టూడియో ప్లాన్ ను అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కాస్త మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు మేకర్స్ అంతా ఎక్కువగా హైదరాబాద్ శివార్లలోని ల్యాండ్ ను లీజ్ కు తీసుకుని సెట్లను నిర్మిస్తున్నారు. అక్కడ అనేక రోజులపాటు షూట్ చేస్తున్నారు. స్డూడియోస్ లో కూడా షూటింగ్ చేస్తున్నా.. ప్రైవేట్ స్టూడియో ల్యాండ్స్ కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కువ పాపులర్ అయింది. అనేక మంది మేకర్స్ దానివైపే మొగ్గు చూపిస్తున్నారు.

షూటింగ్ కు అయ్యే ఖర్చు.. స్టూడియోస్ కన్నా బయట సెట్స్ వేసి షూట్ చేస్తే బాగా తగ్గుతుందని చెబుతున్నారు. అందుకే బయటే ప్రిఫర్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. అదే సమయంలో అల్లు స్టూడియోస్ ఉన్న కోకాపేట.. ఇప్పుడు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఏరియాగా మారింది. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలతో నిండిపోయింది. అక్కడే ప్లాట్స్ కొనేందుకు అనేక మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఆ ఏరియా ఫుల్ బిజీగా మారింది. ఇళ్లు, ల్యాండ్ రేట్లు కూడా భారీగా పెరిగాయట!

దీంతో ఆ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ రీసెంట్ గా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ స్టూడియో కంటే మల్టీప్లెక్స్ బెటర్ అని ఆలోచించారట. ఫిల్మ్ స్టూడియో ఒక అంతస్తులో ఉంటే.. మిగతాది మల్టీప్లెక్స్ కోసం వినియోగిద్దామని ఫిక్స్ అయ్యారని టాక్. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా చిన్నపాటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారట. అలా ఇటు స్టూడియోగా అటు మల్టీప్లెక్స్ గా అల్లు స్టూడియోస్ ను ఛేంజ్ చేయనున్నారని సమాచారం.